NTV Telugu Site icon

Parliament Sessions: పార్లమెంట్ లో 141 మంది ఎంపీల సస్పెన్షన్.. దేశవ్యాప్తంగా ధర్నాకు విపక్షాలు ప్లాన్..?

Parlament

Parlament

ఇవాళ పార్లమెంట్‌లో విపక్ష పార్టీలకు చెందిన 141 మంది ఎంపీలను సస్పెన్షన్‌ చేసిన వ్యవహారం కుదిపేస్తుంది. పార్లమెంట్‌ నుంచి రికార్డు స్థాయిలో ఎంపీల సస్పెన్షన్‌ చేయడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మొత్తం 141 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్‌.. సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఎంపీల సస్పెన్షన్, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది.

Read Also: IPL 2024 Auction: నాకు అంత ధరా.. షాక్‌కు గురయ్యాను: మిచెల్‌ స్టార్క్‌

అయితే, పార్లమెంట్‌ భద్రత లోపభూయిష్ట ఘటనపై కేంద్ర మంత్రి అమిత్‌ షా చేసిన ప్రకటనపై విపక్షాలు మొండిగా డిమాండ్ చేస్తున్నాయి. లోక్‌సభ సమావేశంలో కేంద్ర మంత్రి ప్రకటనపై విపక్షాలు పదే పదే మాట్లాడి లోక్‌సభలో రభస సృష్టించాయి. విపక్షాల ఆందోళనతో పలువురు ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకు లోక్‌సభ నుంచి 95 మంది, రాజ్యసభ నుంచి 46 మంది ఎంపీలు సహా మొత్తం 141 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఎంపీల సస్పెన్షన్‌ నేపథ్యంలో సస్పెండ్‌ అయిన ఎంపీలకు పార్లమెంట్‌ ఛాంబర్‌, లాబీ, గ్యాలరీల్లోకి రాకుండా లోక్‌సభ సెక్రటేరియట్‌ సర్క్యులర్‌ జారీ చేశారు.

Read Also: Spices Inflation : సామాన్యుడికి ధరాఘాతం.. భారీగా పెరుగుతున్న మసాలా దినుసుల ధరలు

ఇక, దేశంలో ఒకే పార్టీ పాలనను నెలకొల్పాలని ప్రధాని మోడీ, బీజేపీ భావిస్తున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే పార్లమెంట్ నుంచి ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆయన అన్నారు. సస్పెండ్ అయిన ఎంపీలకు వ్యతిరేకంగా డిసెంబర్ 22న దేశ వ్యాప్త నిరసనకు యోచిస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.