పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశానికి ముందు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. భేటీ అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. సమావేశంలో చర్చలు చాలా సహృదయపూర్వకంగా జరిగాయన్నారు. ఈ స్వల్పకాలిక సమావేశంలో ప్రతి అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన చెప్పారు. దేశంలో ప్రజా స్వామ్యం ఉందా.. నియంతృత్వ పోకడతో పాలన నడుస్తుంది.. దేశాన్ని రక్షించాలి అని ఆలోచన బీజేపీకి లేదు.. 146 మంది సభ్యులను సస్పెండ్ చేయడం ఏంటి? అని భట్టి విక్రమార్క అన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతి పక్ష పార్టీలకు చెందిన ఎంపీలను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత సోనియా గాంధీ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఇవాళ పార్లమెంట్‌లో విపక్ష పార్టీలకు చెందిన 141 మంది ఎంపీలను సస్పెన్షన్ చేసిన వ్యవహారం కుదిపేస్తుంది. పార్లమెంట్ నుంచి రికార్డు స్థాయిలో ఎంపీల సస్పెన్షన్ చేయడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.