Waqf Bill: ఇలా చేస్తే జేపీసీ నుంచి తప్పుకుంటాం.. లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపీలు..
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన విపక్ష ఎంపీలు
- ఛైర్మన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని ఆరోపణలు
- పారదర్శకతను పాటించడం లేదని విమర్శలు
- ఎంపీలు స్పీకర్‌ను కలిసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వక్ఫ్ (సవరణ) బిల్లుపై దర్యాప్తు చేస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఛైర్మన్ ఏకపక్ష నిర్ణయాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశాయి. తాము జేపీసీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని విపక్ష ఎంపీలు హెచ్చరించారు. లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును పరిశీలించే బాధ్యతను జగదాంబిక పాల్ నేతృత్వంలోని జేపీసీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఆయన ఇతర కమిటీ సభ్యులను సంప్రదించకుండా మూడు రోజుల సెషన్ నిర్వహిస్తున్నారని, ఇది సరైన పద్దతి కారదని తెలిపారు. పారదర్శకతను పాటించడం లేదని, దీని వల్ల ప్యానెల్ ఉద్దేశం దెబ్బతినే చాన్స్ ఉందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష ఎంపీలు బిర్లాను కలవవచ్చు..
విపక్ష సభ్యులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో కమిటీ కార్యకలాపాల్లో తాము వినలేదని, అటువంటి పరిస్థితిలో తాము కమిటీ నుంచి వైదొలగవలసి రావచ్చని పేర్కొన్నారు. మంగళవారం బిర్లాను కలుసుకుని ఫిర్యాదుల గురించి వివరించవచ్చని ప్రతిపక్షాలకు సంబంధించిన వర్గాలు తెలిపాయి. డీఎంకే ఎంపీ ఏ రాజా, కాంగ్రెస్‌కు చెందిన మహ్మద్ జావేద్, ఇమ్రాన్ మసూద్, ఏఐఎంఐఎంకు చెందిన అసదుద్దీన్ ఒవైసీ, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సంజయ్ సింగ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ సహా ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభ స్పీకర్‌కు ఉమ్మడి లేఖ రాశారు.
Also Read
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
- Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
జగదాంబిక పాల్‌పై ఎలాంటి ఆరోపణలు వచ్చాయి?
సమావేశాల తేదీలను నిర్ణయించడంలో, కొన్నిసార్లు వరుసగా మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించడంలో, కమిటీ ముందు ఎవరిని పిలవాలో నిర్ణయించడంలో, సీనియర్ బిజెపి ఎంపీ జగదాంబిక పాల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. సన్నద్ధత లేకుండా ఎంపీలు చర్చలు జరపడం ఆచరణ సాధ్యం కాదన్నారు. విధివిధానాలను దాటవేసి, ప్రభుత్వ ఇష్టానుసారం ప్రతిపాదిత చట్టాన్ని ఆమోదించే సాధనంగా కమిటీని చూడకూడదని ప్రతిపక్ష సభ్యులు లేఖలో ప్రస్తావించారు. బీజేపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగా తమ పనికి అంతరాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే.. విపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను చెప్పేందుకు అనుమతించలేదన్న ఆరోపణలను పాల్ తోసిపుచ్చారు. అందరికీ వినిపించేలా చూసుకున్నానని చెప్పారు.
తాజావార్తలు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!