Oppo Find N3 Flip Smartphone Launching on August 29: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ‘ఒప్పో’ నుంచి మరో ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ రానుంది. అదే ‘ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్’. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగష్టు 29న అధికారికంగా లాంచ్ కానుందని కంపెనీ గురువారం ప్రకటించింది. రాబోయే లాంచ్ ఈవెంట్‌లో ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉందట. ఇక ఆగష్టు 29న ఒప్పో వాచ్ 4 ప్రోని కూడా కంపెనీ లాంచ్ చేస్తుంది. అయితే ఈ రెండు ఆగస్టు 29న చైనాలో లాంచ్ అవ్వనున్నాయి. ఫైండ్ ఎన్3 ఫ్లిప్, వాచ్ 4 ప్రో ఇమేజెజ్‌ని కంపెనీ అధికారికంగా రిలీజ్ చేసింది.
ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్, ఒప్పో వాచ్ 4 ప్రోలు ఆగస్టు 29న చైనాలో మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ అవనున్నాయి. ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ ఇమేజెస్ పరిశీలిస్తే.. తన పోటీదారుల కన్నా చిన్నవిగా కనిపిస్తున్నాయి. నిలువు కవర్ స్క్రీన్‌తో క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్ మాదిరి ఉంది. Motorola Razr 40 Ultra, Samsung Galaxy Z Flip 5, OnePlus ఫోన్‌లలో కనిపించే ట్రై-స్టేట్ అలర్ట్ స్లయిడర్ ఈ ఫోన్ ఎడమ వైపున ఉంటుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉన్నాయి. ఇది ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉండనుంది. కెమెరా కోసం వృత్తాకార హౌసింగ్ హాసెల్‌బ్లాడ్ బ్రాండింగ్‌ను కూడా కలిగి ఉంది.
Also Read: Bray Wyatt Dead: 36 ఏళ్ల వయసులోనే.. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ బ్రే వ్యాట్ మృతి!
ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 3.26-అంగుళాల కవర్ అమోలెడ్ స్క్రీన్ కూడా ఉంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9200 SoC Mali-G715 Immortalis MP11 GPUతో వస్తుంది. ఈ ఫోన్ గరిష్టంగా 16GB RAM మరియు 512GB స్టోరేజ్‌తో రానుంది. ఆండ్రాయిడ్ 13-ఆధారిత ColorOS 13.1పై రన్ అవుతుంది. OISతో 50MP SonyIMX 890 ప్రైమరీ లెన్స్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 32MP టెలిఫోటో సెన్సార్ వెనక భాగంలో ఉంటాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందువైపు 32MP కెమెరా ఉంటుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,300mAh బ్యాటరీతో వస్తుంది. అయితే ఈ ఫోన్ ధర తెలియరాలేదు.