Bray Wyatt Dead: 36 ఏళ్ల వయసులోనే.. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ బ్రే వ్యాట్ మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former WWE Champion Bray Wyatt Dies At 36 From Heart Attack: ప్రపంచ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ బ్రే వ్యాట్ కన్నుమూశారు. 36 ఏళ్ల వయసులోనే వ్యాట్.. గురువారం గుండెపోటుతో మరణించారు. మాజీ ఛాంపియన్ బ్రే వ్యాట్ గుండెపోటుతో కన్నుమూసినట్లు డబ్ల్యూడబ్ల్యూఈ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ పాల్ ‘ట్రిపుల్ హెచ్’ లెవెస్కీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. విషయం తెలిసిన డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
బ్రే వ్యాట్ మృతిపై ట్రిపుల్ హెచ్ తన ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించాడు. ‘డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్ మైక్ రొటుండా (బ్రే వ్యాట్ తండ్రి) నుంచి బాధాకరమైన వార్త వచ్చింది. మా డబ్ల్యూడబ్ల్యూఈ కుటుంబంలోని సభ్యుడు విండం రొటుండా కన్నుమూశాడు. వ్యాట్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఈ విషాద సమయంలో వారి ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నా’ అని ట్రిపుల్ హెచ్ ట్వీట్ చేశాడు. వ్యాట్ అసలు పేరు ‘విండమ్ రొటిండా’.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బ్రే వ్యాట్.. డబ్ల్యూడబ్ల్యూఈ పోటీలకు దూరంగా ఉంటున్నాడు. బహిర్గతం చేయలేని ఆరోగ్య సమస్యతో అతడు బాధపడుతున్నాడని సమాచారం. డబ్ల్యూడబ్ల్యూఈతో 2009లో ఒప్పందం చేసుకున్న వ్యాట్.. 2022 వరకు పోటీల్లో పాల్గొన్నాడు. మూడుసార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ప్రపంచ ఛాంపియన్‌గా అతడు నిలిచాడు. డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌ను ఒకసారి, రెండుసార్లు యూనివర్సల్ ఛాంపియన్‌షిప్‌ను వ్యాట్ సొంతం చేసుకున్నాడు.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్.. ఇంకోసారి చేయొద్దంటూ..!
బ్రే వ్యాట్ తండ్రి హాల్ ఆఫ్ ఫేమర్ మైక్ రొటుండా, తాత బ్లాక్‌జాక్ ముల్లిగన్ కూడా ఫ్రొఫెషనల్ రెజ్లర్ కావడం విశేషం. వ్యాట్ కుటుంబంలో మరికొందరు రెజ్లర్లు కూడా ఉన్నారు. అతడి మేనమామలు బారీ, కెండల్ విండ్‌హామ్ కూడా రెజ్లింగ్ ప్రపంచంలో కెరీర్‌ను కొనసాగించారరేట. రెజ్లింగ్ ప్రపంచంలో బ్రే వ్యాట్ వంశం లోతుగా పాతుకుపోయింది. బ్రే వ్యాట్ మూడవ తరం రెజ్లర్. బ్రే వ్యాట్ ఈ ఏడాది జనవరిలో జరిగిన రాయల్ రంబుల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. 2009లో మొదలైన బ్రేవ్యాట్ రెజ్లింగ్ ప్రయాణం.. 2023తో ముగిసింది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..