టాలీవుడ్ యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్.. శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కింది.. ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా, రుహానీ శర్మ, నవదీప్, శతాఫ్, సంపత్, పరేష్ పహుజా, అభినవ్ గోమఠం, అలీ రాజా, శ్వేతవర్మ తదితరులు నటించారు. రెనైసెన్స్ పిక్చర్స్, సోని పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది..
ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదలైంది.. పుల్వామా అటాక్, దానికి భారతదేశం ఉగ్రవాదులకు ఇచ్చిన కౌంటర్ అటాక్.. వంటి రియల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. మన తెలుగులో ఇలాంటి సినిమా రావడం ఇదే మొదటిసారి. ఈ సినిమాలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి అద్భుతంగా చూపించారు.. సినీ ప్రేక్షకులను ఈ అంశం బాగా ఆకట్టుకుంది.. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. భారీగా కలెక్షన్స్ ను కూడా అందుకుంది..
ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ దక్కించుకుంది. నాలుగు వారాల తర్వాత తెలుగు భాషలో అమెజాన్ లో ఆపరేషన్ వాలంటైన్ స్ట్రీమింగ్ అవ్వనుంది. అంటే ఏప్రిల్ మొదటి వారంలో ఈ సినిమా ఓటీటీకి రానుందని సమాచారం.అదే హిందీలో మాత్రం రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుందని తెలుస్తుంది. ఇక థియేటర్ రిజల్ట్ కారణంగా ఆపరేషన్ వాలెంటైన్ నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తోన్నట్లు తెలిసింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది. వరుణ్ తేజ్ మూవీ మార్చి 29 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..ఈ మూవీ వారం రోజుల్లో తెలుగు, హిందీ భాషల్లో కలిపి 8.61 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు వెర్షన్‌కు 6.95 కోట్ల వసూళ్లు రాగా…హిందీ వెర్షన్ 1.66 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. తెలుగు, హిందీలో మాత్రమే రిలీజ్ అయిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం తెలుగు, హిందీతో పాటు కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో కూడా విడుదల కాబోతుందని తెలుస్తుంది..