Site icon NTV Telugu

Operation Sindoor: ఫ్రారంభమైన అఖిలపక్ష సమావేశం

All Party Meeting

All Party Meeting

Operation Sindoor: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ సైనిక చర్యకు దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ అంశంపై ఢిల్లీలో జరిగిన గత అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు ఏకతాటిపైకి వచ్చాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు నిన్ననే సమావేశమై ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అయితే.. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సహా ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరఫున రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు.

AP Cabinet: భూ కేటాయింపులపై ఆమోదం తెలపనున్న కేబినెట్‌.. యుద్ధ వాతావరణంపై చర్చ!

‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతమైన సైనిక చర్యను ప్రభుత్వం అఖిలపక్షానికి వివరించనుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ సైనిక చర్య అమలు క్రమాన్ని ప్రతిపక్షాలకు తెలియజేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశ అంతర్గత భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు అమిత్ షా తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని సరిహద్దు రాష్ట్రాలకు ఆయన సూచనలు చేశారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ, దేశ భద్రత విషయంలో తమ సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతం కావడం పట్ల వారు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
Operations Sindoor : పాక్ పరువు పోయింది.. మేం ఏం చేయలేం అంటూ వీడియోలు

Exit mobile version