Site icon NTV Telugu

Operation Karag : ఉన్నత చదువుల నుంచి ఉద్యమబాట వైపు.. ‘ఆపరేషన్ కగార్’లో షాద్‌నగర్ యువతి మృతి

Maoists

Maoists

Operation Karag : రంగారెడ్డి జిల్లా, కేశంపేట మండలం, వేములనర్వ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పన్నెండేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న తమ గ్రామ యువతి విజయలక్ష్మి అలియాస్ భూమిక, ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ‘ఆపరేషన్ కగార్’లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు వార్తలు రావడంతో గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. విజయలక్ష్మి ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లింది. అక్కడే ఆమె ఉద్యమాలకు ఆకర్షితురాలై, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందని స్థానికులు చెబుతున్నారు. కుటుంబానికి దూరంగా, ఒక ఆశయంతో పయనించిన ఆమె జీవితం ఇలా విషాదకరంగా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు. సుదీర్ఘ కాలం పాటు కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు దూరంగా ఉన్న విజయలక్ష్మి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అందరూ ఆమె సురక్షితంగా ఉందని ఆశించారు.

Terror Conspiracy Case: నేడు సిరాజ్, సమీర్లను కస్టడికి తీసుకోనున్న పోలీసులు

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఆపరేషన్ కగార్ వివరాలు, ఎన్‌కౌంటర్ గురించి పూర్తి స్పష్టత లేనప్పటికీ, విజయలక్ష్మి మృతి వార్త మాత్రం వేములనర్వ గ్రామ ప్రజలను తీవ్రంగా కలచివేసింది. పన్నెండేళ్ల క్రితం బయలుదేరిన ఉద్యమ బాట ఆమెను మృత్యువు ఒడిలోకి చేర్చిందని గ్రామస్తులు విలపిస్తున్నారు. విజయలక్ష్మి మృతదేహాన్ని నేడు స్వగ్రామమైన వేములనర్వకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఈ దుర్ఘటనను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Preity Zinta: పంజాబ్ కింగ్స్ జట్టులో వివాదం.. కోర్టులో ప్రీతి జింటా పిటిషన్‌!

Exit mobile version