Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో కూటమి తిరుగులేని విజయం సాధించింది.ఏకంగా 164 సీట్లు సాధించి సంచలనం విజయం నమోదు చేసింది.జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ సీట్లు ,2 పార్లమెంట్ సీట్లలలో పోటీ చేసి అన్నింటిని గెలిపించుకొని 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించారు.అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కూడా భాద్యతలు స్వీకరించారు.అయితే మొన్నటివరకు రాజకీయాలలో బిజీ గా వున్న పవన్ కల్యాణ్ తన లైనప్ లో వున్న సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.తాజాగా పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు స్వీకరించడంతో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని చూస్తున్నట్లు సమాచారం.
Read Also :Devara : “ఫియర్ సాంగ్” సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్..
అయితే తన లైనప్ లోని మూవీస్ ని త్వరగా పూర్తి చేయాలనీ చూస్తున్నట్లు సమాచారం.ముందుగా హరిహర వీరమల్లు ,ఆ తరువాత ఓజి ,ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పూర్తి చేయనున్నారట.అయితే తాజాగా పవన్ కల్యాణ్ ఈ సినిమాల షూటింగ్స్ పై ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది .ఇకపై వారంలో కేవలం రెండు రోజులే మాత్రమే పవన్ తన డేట్స్ ను సినిమాలకు కేటాయించనున్నట్లు సమాచారం.మిగిలిన రోజులు ప్రజలకు అందుబాటులో ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే వారంలో రెండు రోజులే అంటే ఈ సినిమా షూటింగ్స్ ఎప్పుడు పూర్తి అవుతాయి అని నిర్మాతలు వాపోతున్నారట . పవన్ తన లైనప్ లో వున్న మూడు సినిమాలను త్వరగా పూర్తి చేస్తే బాగుంటుంది అని నిర్మాతలు భావిస్తున్నారు.మరి నిర్మాతల కోరినట్లుగా పవన్ ఆ మూడు సినిమాలను త్వరగా పూర్తి చేస్తాడా లేదా అనేది చూడాలి.