Online Food Delivery: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్‌కి క్రమంగా ఆర్డర్ల సంఖ్య పెరుగుతుందట.. దీంతో, డెలరీ బాయ్స్ సంఖ్యను పెంచుకునే పనిలో పడిపోతున్నాయట ఫుడ్ డెలవరీ యాప్స్.. అయితే, ఉన్నట్టుండి ఇప్పుడు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బుకింగ్స్ ఎందుకు పెరుగుతున్నాయంటే.. రెండు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.. ఒకటి ఎండలు మండిపోవడం అయితే.. మరొకటి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడం కూడా అంటున్నారు.. ఏప్రిల్ ఆదిలోనే ఎండలు దంచికొడుతున్నాయి.. ముఖ్యంగా మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.. ఎండ వేడిమి తాళలేక అంతా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇప్పటికే టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ కూడా పూర్తికావడం.. సీబీఎస్‌ఈ లాంటి పరీక్షలు పూర్తి చేశారు.. మరోవైపు స్కూళ్లకు ఒంటిపూట బడులు జరుగుతున్నాయి.. కానీ, మధ్యాహ్నం తర్వాత కూడా జనం బయకు వెళ్లడానికి జంకుతున్నారట..
Read Also: Yash Thakur-IPL 2024: ఐపీఎల్ 2024లో లక్నో బౌలర్ల హవా.. యశ్ ఠాకూర్ అరుదైన రికార్డు!
షాపింగ్‌మాల్స్, రెస్టారెంట్లలో పెద్దగా రద్దీ కనిపించడంలేదంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఈ సమయంలో.. ఆన్‌లైన్ ఆర్డర్లు క్రమంగా పెరుగుతున్నాయని.. ఫుడ్ , ఇతర నిత్యావసరాలు డెలివరీ చేసేవారు చెబుతున్నమాట.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎండలు దంచికొడుతుంటే.. వీకెండ్‌లో సాయంత్రం నుంచే.. మిగతా రోజుల్లో రాత్రి ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతుండడం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు.. నచ్చిన ఫుడ్‌ను మెచ్చిన రెస్టారెంట్‌ను ఆర్డర్ ఇవ్వడమే కాదు.. నిత్యావసరాల ఆర్డర్లు కూడా పెరిగిపోయాయి.. క్రమంగా డెలివరీ యాప్‌లు స్విగ్గీ, జొమాటోల వినియోగం పెరిగిపోయింది.. అయితే, ఆర్డర్లు పెరిగిపోవడంతో.. డెలివరీలో ఆలస్యమూ జరుగుతుందని.. కొన్ని ప్రముఖ హోటళ్లు ఫుడ్ అందించలేక తాత్కాలికంగా ఆన్‌లైన్ సర్వీసులను నిలిపివేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందట.. దీంతో.. ఒకేసారి పెద్ద సంఖ్యలో ఆర్డర్లు రావడంతో హైదరాబాద్‌లోని ప్రధాన సెంటర్లలోని ప్రముఖ రెస్టారెంట్ల ముందు డెలివరీ బాయ్‌లు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తలెత్తిందట.. తమకు సమీపంలోని రెస్టారెంట్‌కు ఆర్డర్ పెట్టినా.. ఆర్డర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో.. డెలివరీ చేయడానికి సమయం పడుతుందని చెబుతన్నారు..
Read Also: USA: టీనేజ్ అబ్బాయిలే ఆమె టార్గెట్.. 14 ఏళ్ల బాలికగా నటిస్తూ పాడు పని..
మరోవైపు ఐపీఎల్ సీజన్‌లో తమ ప్రచారం కోసం కొన్ని యాప్‌లు, రెస్టారెంట్లు.. ఆఫర్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి.. అది కూడా ఆన్‌లైన్ ఫుడ్ బుకింగ్‌కి మొగ్గు చూపేలా చేస్తుందట.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్ తిలకిస్తూ ఎంజాయ్ చేస్తూ.. ఆన్‌లైన్‌లో మెచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం కూడా దీనికి కారణంగా చెబుతున్నారు.. అయితే, పెరిగిన డిమాండ్ దృష్ట్యా.. పలు సంస్థలు అదనంగా డెలివరీ బాయ్‌లను నియమించుకున్నా.. వారికి సిటీపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఆర్డర్ డెలివరీకి ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తోంది.