Online Betting: మధురానగర్‌లో ఆన్లైన్ బెట్టింగ్.. ముఠా అరెస్ట్
- హైదరాబాద్‌లో ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
- మధురానగర్‌లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహణ
- ఏపీకి చెందిన ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బెట్టింగ్ యాప్‌లపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.. ఈ వ్యవహారంలో పలువురు నటీనటులపై కేసులు కూడా నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసి యువత జీవితానికి నాశనం అయ్యే విధంగా చేస్తున్న సెలబ్రిటీల పైన పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏకంగా 11 మంది సెలబ్రెటీల పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో సినీ రాజకీయ రంగంతో పాటు పోలీస్ కానిస్టేబుల్ పైన కూడా కేసు పెట్టారు. ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేసి కోట్ల రూపాయలను సంపాదించిన హర్ష సాయి, సన్నీ యాదవ్, రాజు భయ్యా, నటి శ్యామల, విష్ణుప్రియ, ఇమ్రాన్ ఖాన్ టేస్టీ సన్నీ ఎలా మొత్తం 11 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: Karnataka: కర్ణాటక అసెంబ్లీ నుంచి 6 నెలల పాటు బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..
Also Read
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు కోహ్లీ దూరం.!
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
చాలా మంది యువకులు బెట్టింగ్ యాప్స్‌లో తమ జీవితాన్ని పణంగా పెట్టారు.. చాలామంది ప్రాణాలు కోల్పోయారు.. కొంతమంది చావు బతుకుల మధ్య ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకా చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతూనే ఉన్నారు. ఈ సెలబ్రిటీలు చేస్తున్న ప్రచారానికి చాలామంది ఆకర్షితులై వాటిలో పెట్టుబడి పెట్టారు.. గేమ్స్ ఆడారు.. డబ్బులు పోగొట్టుకున్నారు. చివరికి ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై కఠిన నియంత్రణలు విధించాలని చూస్తోంది. అయినప్పటికీ కేటుగాళ్లు ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహణ ఆపడం లేదు. తాజాగా.. హైదరాబాద్‌లో మరో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: IPL 2025: ఈ సీజన్ ఐపీఎల్ అంపైర్లు వీరే.. ఏడుగురు కొత్తవారికి ఛాన్స్
మధురానగర్‌లోని గేటెడ్ కమ్యూనిటీలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుంది ఓ ముఠా.. ఈ ముఠాను పట్టుకునేందుకు పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌కి చెందిన ఐదుగురిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్‌లో డబ్బులు విపరీతంగా వస్తాయంటూ ఈ ముఠా నకిలీ వీడియోలు తయారు చేయించింది. ఈ ఫేక్ వీడియోలను చూపెడుతూ పలువురిని ఆకర్షించుకుంది. దీంతో.. ఈ ముఠా వలలో పడి ఎంతో మంది లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.
తాజావార్తలు
-
PF Money: ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ విషయంలో ఈ తప్పు చేస్తే భారీ నష్టం తప్పదు!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
-
TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
-
Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో… ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
-
Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు కోహ్లీ దూరం.!
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!