AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఏడాది ఆరంభంలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌ను అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా ఈ మోస్ట్ అవేటెడ్ మూవీపై రకరకాల ఊహగానాలు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
హీరో అల్లు అర్జున్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, అందువల్ల ఈ సినిమా ఆగిపోయే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది లోకేష్ ఇప్పటికే ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసినప్పటికీ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ హోల్డ్‌లో పడిందంటూ వస్తున్న రూమర్స్ బన్నీ ఫ్యాన్స్‌ను కాస్త కంగారు పెట్టాయి. ఈ వార్తలపై ఇరువురికి చెందిన యూనిట్ ను ఆరాతీయగా.. ఈ రూమర్లలో ఎలాంటి నిజం లేదట. అంతా అనుకున్నట్లే సాగుతోందని. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం సైలెంట్‌గా జెట్ స్పీడ్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈ ఏడాది ఆఖర్లోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లే అవకాశం ఉంది.ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న రాకా సినిమా షూటింగ్ పూర్తి కాగానే లోకేష్ ప్రాజెక్ట్ పైనే ఫోకస్ పెట్టనున్నారు. ఈ క్రేజీ సినిమాకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ కాంబినేషన్ రూమర్లకు చెక్ పెడుతూ మేకర్స్ ఎప్పుడు అఫీషియల్ క్లారిటీ ఇస్తారో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!