Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో… ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime Thriller OTT : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఒక హత్య, ఒక దర్యాప్తు, చివర్లో ఒక ట్విస్ట్. అయితే కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల్లో ఉత్కంఠను, భయాన్ని ఒకేసారి నింపేస్తాయి. మనిషి శరీరానికి జంతువుల తలలను అమర్చిన శవాలు వరుసగా కనిపిస్తుంటే ఎలా ఉంటుంది? అలాంటి భయంకరమైన సంఘటనల వెనుక ఉన్నది ఎవరు ? ఆ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయాణమే కన్నడ క్రైమ్ థ్రిల్లర్ ‘హయగ్రీవ’ (Hayagriva). థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ వారకు చాలా ఇంటెన్స్ గా సాగుతుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
కన్నడ యువ హీరో ధన్వీర కథానాయకుడిగా నటించిన ‘హయగ్రీవ’ చిత్రానికి రఘు కుమార్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 27వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, మే 22వ తేదీ నుంచి ‘అమెజాన్ ప్రైమ్’లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పటికి ఇది కన్నడ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. సీరియల్ కిల్లర్ కథలు, సైకలాజికల్ థ్రిల్లర్లు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ సినిమా ఒక మంచి వీకెండ్ వాచ్‌గా చెప్పవచ్చు. ఇక ఇందులో హయగ్రీవ పాత్రలో ధన్వీర తన నటనతో ఆకట్టుకోగా, సంజనా ఆనంద్ తన పాత్రకు న్యాయం చేసింది. ముఖ్యంగా సైకో కిల్లర్ చుట్టూ అల్లుకున్న సస్పెన్స్, దర్యాప్తు సన్నివేశాలు ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా కూర్చోబెడతాయి. క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు కన్నడ సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన మరో ఆసక్తికరమైన ప్రయత్నంగా ‘హయగ్రీవ’ నిలుస్తుంది.
Also Read
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
- Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
‘హయగ్రీవ’ కథ
బెంగళూరులో క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన పోలీస్ ఆఫీసర్ అర్జున్ హయగ్రీవ (ధన్వీర)పాత్రలో కనిపిస్తాడు. అతని భార్య ఐశ్వర్య ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుంది. వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత ఉన్నప్పటికీ, వృత్తిపరంగా హయగ్రీవకు ఒక భయంకరమైన సవాలు ఎదురవుతుంది. నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. అయితే ఆ హత్యల్లో అత్యంత కలవరపెట్టే విషయం ఏమిటంటే, మృతదేహాలపై మనుషుల తలలు లేకపోవడం, వాటి స్థానంలో వివిధ జంతువుల తలలను అమర్చడం. ఈ కేసు వెనుక ఒకే వ్యక్తి ఉన్నాడని హయగ్రీవ గుర్తిస్తాడు. అతను సాధారణ నేరస్థుడు కాదని, వైద్యశాస్త్రంపై మంచి అవగాహన కలిగిన సైకో కిల్లర్ అని అర్థమవుతుంది. కానీ అతను ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు? చనిపోయిన వాళ్ళకి కిల్లర్ కి ఏమిటి సంబంధం ? శరీరాలను ఈ విధంగా మార్చడానికి కారణమేంటి? అనే ప్రశ్నలతో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు అర్జున్. ఈ క్రమంలో స్టోరీ గూస్ బంప్స్ తెప్పించే మలుపులు తీసుకుంటుంది. చివరికి కిల్లర్ ని అర్జున్ పట్టుకుంటాడా ? కిల్లర్ ఎందుకు హత్యలు చేస్తున్నాడు అనే ప్రశ్నలకు సమాధానాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
తాజావార్తలు
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav vs Ishan: క్రెడిట్ అంతా తీసుకున్నావ్.. వైభవ్ భవిష్యత్ కెప్టెన్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
-
S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
-
CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!