Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు కోహ్లీ దూరం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Injured: ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. జూన్ 13 నుంచి 20 వరకు భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. ఈ సిరీస్ కు కోహ్లీ అందుబాటులో ఉండరు. ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు తరఫున ఆడిన కోహ్లీ ఈ గాయానికి గురైనట్లు తెలుస్తోంది. ఫైనల్లో 42 బంతుల్లో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచిన కోహ్లీ, జట్టును వరుసగా రెండో టైటిల్ గెలిచేలా చేశాడు. అయితే మ్యాచ్ చివరి దశలో పరుగులు తీసే సమయంలో అసౌకర్యంగా కనిపించిన కోహ్లీ, అప్పటికే హ్యామ్‌స్ట్రింగ్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2026 సీజన్లో కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 16 మ్యాచ్‌ల్లో 675 పరుగులు సాధించాడు. ఈ ఫామ్‌ను ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లోనూ కొనసాగించి.. 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో తన అవకాశాలను మరింత బలపర్చుకోవాలని కోహ్లీ భావించాడు. అయితే గాయం అతని ప్రణాళికలకు అడ్డంకిగా మారింది. భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలకు తొలి అడుగుగా భావిస్తున్నారు. జూన్ 6 నుంచి ఒక టెస్ట్ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేల సిరీస్ జరగనుంది. టెస్ట్, వన్డే జట్లకు శుబ్ మన్ గిల్ నాయకత్వం వహించనున్నాడు.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
వన్డే ఫార్మాట్లో రోహిత్ శర్మ, కోహ్లీ మళ్లీ భారత జెర్సీలో కనిపించాల్సి ఉండగా.. ఇప్పుడు కోహ్లీ గాయంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అతని స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ జూన్ 6న న్యూ చండీగఢ్‌లో జరిగే ఏకైక టెస్టుతో ప్రారంభమవుతుంది. అనంతరం జూన్ 13న ధర్మశాలలో తొలి వన్డే, జూన్ 17న లక్నోలో రెండో వన్డే, జూన్ 20న చెన్నైలో మూడో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!