ఆన్‌లైన్ గేమ్స్ మరో యువకుడి ప్రాణాలు తీసింది. బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోవడంతో మనస్తాపం చెందిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పైరేట్ గ్రామానికి చెందిన జైచంద్రగా గుర్తించారు. ఆన్‌లైన్ గేమ్స్, యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవద్దంటూ షర్ట్‌పై రాసుకున్నాడు యువకుడు. అయితే.. బెట్టింగుల కారణంగా తీవ్ర అప్పుల పాలై అవి తీర్చలేక ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
READ MORE: CM Chandrababu: చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలపై పుస్తకాల ఆవిష్కరణ..
సమాజంలో బెట్టింగ్‌లు తొలుత సరదాగా మొదలై చివరికది వ్యసనంగా మారుతున్నాయి. బెట్టింగ్ భూతం బారిన పడి ఎంతోమంది బలైపోతున్నారు. ఆ ఉచ్చులోంచి బయటపడలేక ఏదో ఒక రోజు గెలుస్తామని సమాధానం చెప్పుకుంటూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చివరకు ఆ అప్పులు తీర్చలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, హోటళ్లు, టీకేఫ్‌లు, పార్కులు, క్రీడామైదానాలు ఇలా ఎక్కడబడితే అక్కడ యువత, విద్యార్థులు పనులు మానుకుని మరీ గంటలసేపు ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతున్నారు. ఒక్కోసారి సహనం కోల్పోయి గొడవలకు దిగుతున్నారు. ఇలాంటిచోట పోలీసులు నిఘా పెంచితే కొంతవరకైనా ఫలితం ఉంటుంది.
