టెన్త్ అర్హతతో ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వివిధ యూనిట్లలో ఆర్టిసన్ గ్రేడ్-IV పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 515 పోస్టులను భర్తీ చేయనున్నది. ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫౌండ్రీమన్ పోస్టులు భర్తీచేయనున్నారు. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు కనీసం 60%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో టెన్త్ ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ/ఎన్‌టీసీ + ఎన్‌ఏసీ కలిగి ఉండాలి.
Also Read:Infinix Hot 60 5G+: యూత్, గేమింగ్ యూజర్లే టార్గెట్ గా బడ్జెట్ మొబైల్ ను లాంచ్ చేసిన ఇన్‌ఫినిక్స్..!
జనరల్/ ఈడబ్ల్యూఎస్ వారికి 27 ఏళ్లు, ఓబీసీ వారికి 30 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 32 ఏళ్లు మించకూడదు. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.29,500 -రూ.65,000 జీతం అందిస్తారు. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1072 (రూ.600 పరీక్ష + రూ.400 ప్రాసెసింగ్ + GST), ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌సర్వీస్‌మెన్ రూ.472 (ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే) దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 12 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.