NTV Telugu Site icon

TTD : శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. మరో సౌకర్యం అందుబాటులోకి

Bbms

Bbms

టీటీడీ భక్తుల కోస మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈసారి లగేజ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఆటోమేషన్, డిజిటలైజేషన్‌తో భక్తులకు వేగంగా, సులభంగా సేవలందించనుంది. బాలాజీ బ్యాగేజ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BBMS) మొదట ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టబడి విజయవంతమైంది. చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సివిఎస్‌ఓ) డి నరసింహ కిషోర్‌తో కలిసి బీబీఎంఎస్‌ గురించి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వివరించారు. ప్రస్తుతం ఉన్న మాన్యువల్ బ్యాగేజీ నిర్వహణ స్థానంలో సులభంగా, వేగంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మొబైల్ ఫోన్లు, లగేజీ డిపాజిట్, సేకరణ కోసం బీబీఎంఎస్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.

Also Read : Vijay Devarakonda : అనిరుధ్ ని కిడ్నాప్ చేసి అయినా నా సినిమాకు తీసుకోవాలని ఉంది.

దర్శనానికి వెళ్లే సమయంలో కొంత మంది భక్తులు తమ జేబులో దాచుకున్న మొబైల్ ఫోన్‌లను జమ ప్రక్రియలో జాప్యం జరుగుతుందని, తర్వాత గుర్తించామని, ఈ అసౌకర్యానికి గుర్తించామని ఈవో తెలిపారు. కానీ ఇప్పుడు కొత్త వ్యవస్థ భక్తులను సంతృప్తిపరిచేలా మరింత చక్కగా, పారదర్శకతతో సమస్యను పరిష్కరించిందని ఆయన పేర్కొన్నారు. కొత్త విధానంలో దర్శనం టిక్కెట్లు స్కాన్ చేయబడతాయని, వారి లగేజీ, మొబైల్ ఫోన్‌ల వివరాలతో పాటు ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయన్నారు. దర్శనం టిక్కెట్లు లేని వారి వస్తువులు స్కాన్ చేయబడి QR కోడ్ రసీదుతో RFID కోడ్ ఉత్పత్తి చేయబడుతుందని ఈవో తెలిపారు. అదేవిధంగా మొబైల్ డిపాజిట్ కోసం శ్రీవారి దర్శనం టిక్కెట్లతో పాటు భక్తుల ఆధార్ వివరాలను సేకరించి క్యూఆర్ కోడ్, రశీదు ఇస్తారని తెలిపారు.

Also Read : Chandrayaan 3: చంద్రయాన్ 3 ల్యాండింగ్ కోసం ఎదురుచూస్తున్న సెలబ్రెటీలు, ట్విటర్ వేదికగా కోరుకున్న సౌత్ స్టార్స్