Site icon NTV Telugu

Meerut: ఒక అమ్మాయి, నలుగురు స్నేహితులు.. మూడు హత్యలు.. మళ్లీ వెలుగులోకి..!

Meerut

Meerut

వారు నలుగురూ మంచి స్నేహితులు. వారి మధ్య స్నేహం ఎలా ఉంటుందంటే.. ఒకరినొకరు చూసుకోకుండా, మాట్లాడకుండా ఉండలేరు. అయితే ఆ స్నేహితుల్లో ఇద్దరి స్నేహితుల కళ్లు ఒక్క అమ్మాయిపైనే పడ్డాయి. ఇద్దరూ ఆమెను ప్రేమించారు. అంతలోనే ఆ అమ్మాయిని ఇద్దరు ప్రేమిస్తున్నారని తెలిసింది. దీంతో ఇద్దరూ ఒకరికొకరు శత్రువులుగా మారారు. అయితే కొన్ని రోజుల తర్వాత.. నలుగురు స్నేహితులు కలిసి మద్యం సేవిస్తున్నారు. మత్తులో ఉండగా.. ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఒకరికొకరు ఆ అమ్మాయి నాదంటే నాది అని గొడవ పెట్టుకున్నారు. అయితే ఆ గొడవ పెద్దదిగా కావడంతో అమ్మాయిని ప్రేమించే వారిలో ఒకరు.. తన తన స్నేహితులకు ఫోన్ చేసి రమ్మని ముగ్గురు స్నేహితులను హత్య చేయించాడు.

Project K: ప్రాజెక్ట్ కె.. రిలీజ్ డేట్ తెలిసిపోయిందోచ్.. ?

నిందితుడు తన ముగ్గురు స్నేహితుల మృతదేహాలను బాగ్‌పత్‌లోని హిండన్ ఒడ్డున పాతిపెట్టేందుకు ప్రయత్నించగా.. అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ట్రిపుల్ మర్డర్ 2008లో జరగగా.. ఇంకా ఈ కేసు కోర్టులోనే పెండింగ్‌లో ఉంది. మరోవైపు ప్రధాన నిందితుడు హాజీ ఇజ్‌లాల్‌కు ఇటీవల పెరోల్ రావడంతో.. 15 ఏళ్ల తర్వాత మరోసారి ఈ ఘటన వార్తల్లో నిలిచింది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ముఖ్యమంత్రి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాన నిందితుడు ఇజ్‌లాల్‌ను విచారించగా మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మీరట్ కాలేజీలో చదువుతున్న షీబా సిరోహి అనే విద్యార్థినితో ఇజ్లాల్ ఏకపక్షంగా ప్రేమలో ఉన్నాడని పోలీసులకు తెలిపాడు. అదే సమయంలో అతని స్నేహితుడు సునీల్ ధాకా కూడా అతన్ని ఇష్టపడటం ప్రారంభించాడని తెలిపాడు.

Pawan Kalyan: నన్ను అరెస్ట్ చేసుకోండి.. చిత్రవధ చేసుకోండి.. రెడీ..

అప్పట్లో ఈ మర్డర్ మిస్టరీపై మీరట్ నుండి ఢిల్లీ వరకు వందలాది మంది విద్యార్థులు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అంతేకాకుండా వ్యాపారులు కూడా తమ సంస్థలను మూసివేసి శాంతిభద్రతలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అయితే అప్పటి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని మీరట్ కోర్టుకు బదిలీ చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై మీరట్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే నిందితుడు ఇజ్‌లాల్ ఇటీవలే పెరోల్‌పై విడుదలయ్యాడు.

Exit mobile version