Kiladi Lady: నమ్మించి మోసం చేసింది ఓ మాయలేడి. కృష్ణా జిల్లా గుడివాడలో అమాయకులకు మాయమాటలు చెప్పి కోటిన్నర కాజేసింది మాయలేడి. గుడివాడలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. మాయ లేడి లీలావతిపై చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలంటూ రూరల్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ప్రైవేటు బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో రుణాలు ఇప్పిస్తానంటూ లీలావతి మాయమాటలు చెప్పింది. లక్ష్మీ నగర్ కాలనీ, బాపూజీ నగర్, చౌదరి పేట, ఆర్టీసీ కాలనీ, టీడ్కో కాలనీ, జగనన్న కాలనీల్లోని మహిళలతో 60 గ్రూపులు ఏర్పాటు చేసింది.
Read Also: Allu Arjun: నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటన వివాదం.. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు
గ్రూపుల్లోని సభ్యులకు మంజూరైన రుణాల్లో మాయ మాటలు చెప్పి కోటిన్నర తీసుకుంది. రుణాలు ఇప్పిస్తానంటూ పలువురి వద్ద బంగారు ఆభరణాలు తీసుకొని తాకట్టు పెట్టింది. రుణాలు చెల్లించకపోవడంతో, బ్యాంకుల ప్రతినిధులు బాధితుల ఇళ్లకు రావడంతో వారు లీలావతి కోసం వెతికారు. ఆమె అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయింది. లీలావతి హైదరాబాదులోని మియాపూర్‌లో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లి ప్రశ్నించిన ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలోనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదగు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.