CID Investigation: సీఐడీ ప్రశ్నల వర్షం.. చంద్రబాబు ఏమన్నారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CID Investigation: తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సీఐడీ అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సరిగా సమాధానం చెప్పడం లేదని సమాచారం తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబును సీఐడీ 20 కఠినమైన ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు విచారణకు సహకరించడం లేదని.. అధికారులు అడిగిన ఏ ప్రశ్నకు ఆయన సరిగా సమాధానం చెప్పడం లేదని సమాచారం అందుతోంది.
Read Also: G20 Summit Live Updates: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో విందు కార్యక్రమం
Also Read
- Russia-US: డీజిల్ డీల్ తర్వాత.. అమెరికా-రష్యా మధ్య మరో భారీ ఒప్పందం..!
- World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!
- JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
- WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో అక్రమాలకు సంబంధించిన 20 ప్రశ్నలను CID అధికారులు సంధించారు. స్కిల్ డెవలప్మెంట్ అక్రమాలు, హవాలా లావాదేవీలపై సిట్ అధికారులు ప్రశ్నలు కురిపించారు. అంతేకాకుండా అప్పటి నోట్ ఫైల్ ను సీఐడీ అధికారులు చంద్రబాబుకు చూపించారు. దీంతో తన పాత్రను ఖండించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల ప్రతినిధుల మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ను సీఐడీ అధికారులు చంద్రబాబుకు చూపించారు. మరోవైపు.. చాటింగ్ గురించి ప్రశ్నించగా తనకు తెలియదని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.
చాలా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం.. నాకు తెలియదు, నాకు గుర్తు లేదు అన్నట్లు సమాచారం అందుతోంది.
Read Also: Deepthi Sunaina: ”దీప్తి సునయనకి రోడ్డు ప్రమాదం” ప్రచారం.. అసలు ఏం జరిగిందంటే?
ఇదిలా ఉంటే.. చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేశ్‌తో పాటు నందమూరి రామకృష్ణ, పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, వచ్చారు. చంద్రబాబును కలవడానికి భువనేశ్వరి, లోకేశ్ తదితర కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. దీంతో వారు సిట్ కార్యాలయంలోకి వెళ్లారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరారు.
తాజావార్తలు
-
Russia-US: డీజిల్ డీల్ తర్వాత.. అమెరికా-రష్యా మధ్య మరో భారీ ఒప్పందం..!
-
Airtel Recharge Plans: Airtel కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. రూ.185, రూ.203, రూ.206.. వ్యాలిడిటీ, బెనిఫిట్స్ ఇవే!
-
Anupama Parameswaran: పెళ్లి చేసుకోవద్దని నేను ఎక్కడా చెప్పలేదు: అనుపమ
-
World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!
-
PM-VBRY Scheme 2026: తొలిసారి ఉద్యోగం చేసేవారికి రూ.15,000.. రెండో విడత డబ్బుల కోసం ఈ కోర్సు తప్పనిసరి!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!