ఒమేగా సీకి మొబిలిటీ ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్, స్వయంగతిని భారతదేశంలో ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా డ్రైవర్ లేకుండా స్వయంగా నడిచే త్రీ-వీలర్. ఈ వెహికల్ ఇప్పుడు వాణిజ్యపరంగా అందుబాటులో ఉంది. బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్, స్వయంగతి, ప్యాసింజర్, కార్గో అనే రెండు వేరియంట్లలో విడుదలైంది. ప్యాసింజర్ వేరియంట్ ధర రూ. 4.00 లక్షలు, కార్గో వేరియంట్ ధర రూ. 4.15 లక్షలు. కార్గో వేరియంట్ ఇంకా లాంచ్ కాలేదు, కానీ త్వరలో తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.
Also Read:TCS Layoffs: టీసీఎస్‌లో భారీ కుదుపు.. వేల లేఆఫ్స్‌పై రచ్చ!
దీనిలో అందించబడిన బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత 120 కి.మీ వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇది అనేక అద్భుతమైన, అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. దీనికి లైడార్, GPS అందించారు. దీనితో పాటు, AI- ఆధారిత, మల్టీ-సెన్సార్ నావిగేషన్, రిమోట్ భద్రతా నియంత్రణలు అందించారు. విమానాశ్రయాలు, టెక్ పార్కులు, స్మార్ట్ సిటీలు, క్యాంపస్‌లు, పారిశ్రామిక కేంద్రాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా రూపొందించారు. స్వయంగతి 100% ఎలక్ట్రిక్ వాహనం. సున్నా టెయిల్ పైప్ ఉద్గారాలను అందిస్తుంది. నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది. దీని కాంపాక్ట్ డిజైన్, తెలివైన నావిగేషన్ దీనిని స్మార్ట్ సిటీలు, గేటెడ్ క్యాంపస్‌లు, పారిశ్రామిక జోన్స్, రవాణా కేంద్రాలకు అనువైనదిగా చేస్తాయి.