Site icon NTV Telugu

Omar Abdullah : కాల్పుల విరమణ ఒప్పందంపై ఒమర్ అబ్దుల్లా రియాక్షన్..

Omarabdullah

Omarabdullah

పహల్గామ్ ఉగ్రదాడి భారత్‌ను భగ్గుమనేలా చేసింది. ఆపరేషన్ సిందూర్ కారణంగా భారత్ పాక్ మధ్య యుద్ధంలాంటి పరిస్థితి దాపురించింది. తాజాగా ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. ఈ సమాచారాన్ని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అందించారు. కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇంతలో పలువురు రాజకీయ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ అంశంపై మాట్లాడారు.

READ MORE: India- Pakistan: పాకిస్థాన్ ఎన్నిసార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘించిందో తెలుసా?

“నేను కాల్పుల విరమణను స్వాగతిస్తున్నాను. 2-3 రోజుల క్రితం జరిగి ఉంటే.. ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదు. ఎక్కడ నష్టం జరిగిందో అంచనా వేయడం, ప్రజలకు సహాయం అందించడం ప్రస్తుత జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ బాధ్యత. ఎక్కడ ప్రజలు గాయపడినా, వారికి సరైన చికిత్స అందించాలి. ప్రభుత్వ పథకం కింద సహాయం కూడా అందేలా చేస్తాం. ఏ మేరకు నష్టం వాటిల్లిందో తుది నివేదిక తయారు చేస్తాం. ఆ అంచనాను తమకు పంపాలని డీసీకీ ఆదేశాలు అందాయి. త్వరలో బాధిత కుటుంబాలకు సహాయం అందించేలా చర్యలు తీసుకుంటాం. అలాగే.. మా విమానాశ్రయం చాలా రోజులుగా మూసివేశారు. కాల్పుల విరమణ తర్వాత విమానాశ్రయం తిరిగి తెరుస్తారని ఆశిస్తున్నాం.” అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.

READ MORE: IND PAK War: ‘మా పని కాదు..’ నుంచి ‘కాల్పుల విరమణ’ వరకు.. అమెరికా వైఖరి ఏంటి?

Exit mobile version