మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఓం భీమ్ బుష్. ఈ సినిమాలో హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నటించారు. హర్రర్ కామెడీగా వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. విడుదల ముందు ఎలాంటి ఆశలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. 30 కోట్ల వరకు దాదాపు వసూళ్లను రాబట్టింది. థియేటర్లో ఉన్నంత సేపు ప్రేక్షకులకు నవ్వించేలా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు డైరెక్టర్ శ్రీ హర్ష దర్శకత్వం వహించాడు.
Also read: Sundeepkishan VIBE: సూపర్ హిట్ డైరెక్టర్ తో ‘వైబ్’ కుదిరిదంటున్న సందీప్ కిషన్..!
ఇక ప్రస్తుతం థియేటర్లలో ఫన్ అండ్ హర్రర్ గా అలరిస్తున్న ఈ సినిమా అతి త్వరలో ఓటీటీ లోకి రాబోతుంది. అనుకున్న దానికంటే ముందే ఈ సినిమా ఆన్లైన్లో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను ఏప్రిల్ 19 నుంచి ఓటిటిలోకి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ విషయం సంబంధించి అధికారిక ప్రకటన అతి త్వరలో రాబోతోంది.
Also read: Delhi Police: విరాట్ కోహ్లీ- గౌతమ్ గంభీర్ మధ్య గొడవపై ఢిల్లీ పోలీసులు చేసిన పోస్ట్ వైరల్..
ఇక ఈ సినిమాలో ముగ్గురు ప్రాణ స్నేహితులు బ్యాంగ్ బ్రోస్ అంటూ బైరవపురంలో అడుగుపెడతారు. అక్కడ వారు డబ్బులు సంపాదించడం కోసం సైంటిస్టులుగా కొత్త అవతారం ఎత్తుతారు. ఊరివారు వీరు గురించి తెలుసుకోవడానికి ఓ పరీక్ష పెట్టగా అందులో వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారన్న విషయంపై కథనం కొనసాగుతుంది. పూర్తి విశేషాల కోసం సినిమా చూడాల్సిందే.