Veera Simha Reddy: వీరసింహారెడ్డి మాస్ మ్యానియా మొదలైపోయింది. ఎక్కడ చూసినా జై బాలయ్య నినాదాలతో మారుమ్రోగిపోతోంది. థియేటర్ లో సీట్లు చిరిగిపోతున్నాయి. చిన్నా, పెద్ద, ముసలి, ముతక అని లేకుండా బాలయ్య స్లొగన్స్ తో హోరెత్తిస్తున్నారు. కొన్నిచోట్ల థియేటర్లు తగలబడిపోయాయి కూడా.. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన వీర సింహారెడ్డి నేడు రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. అభిమానుల్లో నందమూరి బాలకృష్ణ ఫాలోయింగ్ చూస్తుంటే మెంటలెక్కిపోతోంది. ఇక ఉదయం నుంచి థియేటర్ల వద్ద బాలయ్య అభిమానుల హంగామా అంతాఇంతా కాదు. ఒక అభిమాని ఏమో సినిమా బాగాలేదు అన్నాడని సీసా పట్టుకొని కొట్టడానికి వెళ్ళాడు. ఆ వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెల్సిందే. అది ఇంకా ట్రెండ్ అవుతున్న సమయంలోనే మరొక వీడియో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. బాలయ్యకు యువకులే కాదు పూజారులు కూడా ఫ్యాన్స్ అని ఈ వీడియో నిరూపిస్తోంది.
సాధారణంగా పూజారులు.. సినిమాలు చూడరు. అది అందరికి తెల్సిన విషయమే. అయితే తాజాగా తిరుపతి లో ఒక పూజారి వీరసింహారెడ్డ సినిమా మొదటి షో చూడడమే కాకుండా జై బాలయ్య సాంగ్ కు మాస్ స్టెప్పులు కూడా వేసి షాక్ ఇచ్చాడు. ఆయన వయసు దగ్గరదగ్గర 70 ఉండొచ్చు.. కానీ ఆ వయసులో కూడా బాలయ్య సాంగ్స్ కు ఊగిపోతూ స్టెప్స్ వేస్తూ కనిపించాడు. తిరుపతి ప్రతాప్ థియాటర్ లో ఈ ఘటన చోటుచేసుకొంది. ఇక పూజారి స్టెప్స్ కు ముగ్దులైన బాలయ్య అభిమానులు ఆయన డ్యాన్స్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. బాలయ్య అంటే యువతకే కాదు అందరికి అభిమానమే.. అది బాలయ్య రేంజ్ అని బాలయ్య ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.