Oka Parvathi Iddaru Devadasulu: టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలతో వచ్చే భారీ బడ్జెట్ సినిమాలు ఎంత క్రేజ్ సంపాదిస్తాయో, అదే తరహా ఉత్సాహాన్ని కొన్నిసార్లు చిన్న సినిమాలు కూడా అందిస్తాయి. తక్కువ బడ్జెట్‌తో కానీ, కొత్త కాన్సెప్ట్‌లతో కానీ, సహజమైన కథా నేపథ్యంతో కానీ వచ్చినప్పుడు ఈ చిన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. ఇటీవల OTTల హవా పెరుగుదలతో పాటు థియేటర్లలో కూడా మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు మద్దతు పెరుగుతోంది. ఈ తరహా హవాలోనే మరో కొత్త, విభిన్నమైన ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Ownly: ‘ఓన్లీ’ ప్రారంభించిన ర్యాపిడో.. స్విగ్గీ, జొమాటోల ఆధిపత్యానికి సవాల్!
నిజానికి టాలీవుడ్ సినిమాలకు సంబంధించి పార్వతి దేవదాసుల ప్రేమకథకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సారి.. కొత్తగా ‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’ అనే సరికొత్త టైటిల్‌తో ఓ ఫ్రెష్ లవ్ స్టోరీని మాహిష్మతి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట రామకృష్ణ దర్శకత్వం వహిస్తూ, నిర్మాతగా కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సిద్దార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా నటిస్తుండగా, రాశీ సింగ్ హీరోయిన్గా కనిపించనుంది. రఘు బాబు, కసిరెడ్డి రాజ్ కుమార్, వీర శంకర్, గౌతంరాజు, రాకెట్ రాఘవ, గుండు సుదర్శన్, రజిత వంటి పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించింది ఈ చిత్ర బృందం.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ యువతను బాగా ఆకట్టుకుంటుందని దర్శక–నిర్మాత తోట రామకృష్ణ విశ్వాసం వ్యక్తం చేశారు.