పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలాన్ గా నటించాడు. RRR వంటి భారీ సినిమాను నిర్మించిన దానయ్య DVV బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూసిన OG మొత్తానికి గత రాత్రి ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఓవర్సీస్ లోను ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన ఓజి టాక్ ఎలా ఉందంటే.. పవర్ స్టార్ పవర్ఫుల్ ఎంట్రీతో సాలిడ్ స్టార్ట్ అందుకున్న సినిమా ,మొదటి 20నిముషాలు అదరగొడుతుంది. కానీ ఆ తర్వాత నుండి కథనం నెమ్మదిగా సాగుతుంది. ఫస్టాఫ్ లో పవర్ స్టార్ కు నాలుగైదు ఎలివేషన్స్ తో ఫ్యాన్స్ కు ట్రేట్ ఇచ్చాడు, కానీ పవన్ కళ్యాణ్ తెరపై కనిపించేది 20 – 25 నిమిషాలే. ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. పవర్ స్టార్ కెరీర్ బెస్ట్ సీన్ అనే చెప్పొచ్చు. ఓవరాల్ గా ఫస్టాప్ డీసెంట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా. సెకండాఫ్ ను హైతో స్టార్ట్ చేసిన దర్శకుడు ఒక్క పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ మినయించి ఎక్కడా కూడా సెకండాఫ్ ను సరిగా హ్యాండిల్ చేయలేదు. ప్రియాంక మోహన్ పాత్ర మైనస్. ప్రతి సీన్ ను ఎలివేషన్ లాగా డిజైన్ చేయడం ఫ్యాన్స్ ఓకే జనరల్ ఆడియెన్స్ కావాల్సింది కథ, కథనం. ఇక్కడ అదే లోపించింది. ఈ సినిమాకు సరైన న్యాయం చేసిందంటే తమన్. ప్రతి సీన్ కు అద్భుతమైన మ్యూజిక్ తో అదరగొట్టాడు. పవర్ స్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. సుజీత్ డైరెక్షన్ బాగుంటే ఇంకా బాగుండేది. ఓవరాల్ గా యావరేజ్ సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది.