పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “ఓజి”. ఈ సినిమాను దర్శకుడు సుజీత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హస్మి మరియు అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దాదాపు 20 రోజుల నుండి సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్బంగా ఓజీ మూవీ నుండి అప్డేట్ ఉంటుంది అంటూ మేకర్స్ ఫ్యాన్స్ లో ఆశలు రేకెత్తించారు.అంతెందుకు మొన్నటికి మొన్న కూడా అన్నీ రికార్డ్స్ బద్దలవుతాయి అంటూ మరో అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్..దీంతో ఖచ్చితంగా ఓజీ మూవీ నుండి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ గ్లింప్స్ ను విడుదల చేస్తారని ఫ్యాన్స్ భావించారు..
కానీ తాజాగా మరో అప్డేట్ ఇస్తూ ఆ ఆశలు అడియాశలు చేసారు మేకర్స్. మూవీ నీ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న డీవీవీ ఎంటెర్టైమెంట్స్ తన ట్విట్టర్ అకౌంట్ తాజాగా ఒక అప్డేట్ ను ఇచ్చారు.అందులో నో ఫస్ట్ లుక్ అంటూ ఉంది ఇది చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతన్నారు.పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ వస్తుందనీ పవన్ బర్త్డే సందర్బంగా సందడి చేయాలనీ భావించిన ఫ్యాన్స్ ఈ ఒక్క అప్డేట్ తో తీవ్ర నిరాశ చెందుతున్నారు.అయితే మేకర్స్ ముందు చెప్పినట్టుగానే సెప్టెంబర్ 2న అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కానీ అది టీజర్ కాదు ఫస్ట్ లుక్ కాదు. ఓజీ మూవీ కి సంబంధించి అద్భుతమైన విజువల్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వీడియో ను అందిస్తాం.. సెప్టెంబర్ 2 న ఆకలితో వున్న చీతా కోసం ఎదురు చూద్దాం.మీ స్క్రీన్ లు, వూఫర్ లు సిద్ధం చేసుకోండి అంటూ మేకర్స్ ట్వీట్ చేసారు.
https://twitter.com/DVVMovies/status/1696042980677943590?s=20