OG Movie: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ఓజి. సుజిత్ దర్శకత్వంలో రూపొందించబడిన ఈ సినిమాని డివిడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించారని సుజిత్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేత ఒక జపనీస్ హైకూ పాడించారు. వాషి ఓ వాషి అంటూ సాగే ఆ జపనీస్ హైకూ గురించి చర్చ జరుగుతుంది. అయితే తాజాగా ఒక జపనీస్ తెలుగు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దాని అర్ధాన్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు ఆ అర్థం మీకోసం.