Dharmpuri: ధర్మపురి అసెంబ్లీ ఫలితాల వివాదం.. నేడు స్ట్రాంగ్‌రూంను తెరవనున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmpuri: హైకోర్టు ఆదేశాలతో ధర్మపురి శాసనసభ నియోజకవర్గ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంను సోమవారం ఉదయం 10 గంటలకు అధికారులు తెరవనున్నారు. 2018 నాటి ఎన్నికల ఫలితాల ప్రకటనలో అవకతవకలు జరిగాయని కొప్పుల ఈశ్వర్ ఎన్నిక అక్రమమని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో ఈవీఎంలను జగిత్యాల వీఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. అప్పటి రిటర్నింగ్ అధికారి భిక్షపతి ఉద్యోగ విరమణ చెందడంతో న్యాయస్థానానికి హాజరు కాకపోగా వారెంట్ జారీచేసి గత నెల 21లోగా హాజరుపర్చాలని రాచకొండ పోలీసు కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.
Read Also: CM KCR: యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఎన్నికల ఫలితాలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంను తెరిచి అప్పటి ఎన్నికకు సంబంధించిన 17ఏ,17 సీ డాక్యుమెంట్ కాపీలను, కౌంటింగ్ సీసీ ఫుటేజి, ఎన్నికల ప్రొసీడింగ్స్‌ను ఈనెల 11న సమర్పించాలని ఆ సమయంలో ఉన్న రిటర్నింగ్ అధికారి భిక్షపతిని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో భిక్షపతి న్యాయస్థానంలో హాజరై వివరణ ఇచ్చారు. ఈనెల 11లోగా వివరాలు సమర్పించాల్సిందిగా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన జగిత్యాలకు వచ్చి జిల్లా కలెక్టర్‌కు వివరాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా సమక్షంలో స్ట్రాంగ్‌రూం తెరిచి ఎన్నికలకు సంబంధించిన వివరాలను రిటర్నింగ్ అధికారికి అప్పగించనున్నారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!