Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Office Romance on the Rise: ఆఫీస్ రొమాన్స్ అనేది ఇప్పుడు కేవలం సినిమాలకే పరిమితం కావడం లేదు. నిజ జీవితంలోనూ సర్వసాధారణమైపోయింది. తాజాగా ‘ఫోర్బ్స్’ వెల్లడించిన ఒక సర్వే నివేదిక ఈ విషయంలో ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం.. సుమారు 60 శాతానికి పైగా ఉద్యోగులు తమ పని ప్రదేశంలో ఎవరో ఒకరితో ప్రేమాయణం సాగించినట్లు తేలింది. రోజుకు దాదాపు 9 గంటల పాటు కలిసి పని చేయడం, వృత్తిపరమైన ఒత్తిడిని అర్థం చేసుకునే భాగస్వామి పక్కనే ఉండటం వంటి కారణాల వల్ల చాలామంది ఆఫీస్‌లోనే తమ తోడును వెతుక్కుంటున్నారు. బయట కొత్త వ్యక్తులను కలిసే సమయం లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని 61 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక 38 శాతం మంది మాత్రమే ఆఫీస్ రొమాన్స్ వల్ల పనిలో ఉత్సాహం పెరుగుతుందని భావిస్తున్నారు.
అయితే, ఈ ఆఫీస్ డేటింగ్ వల్ల వ్యక్తిగత జీవితంపైనే కాకుండా వృత్తిపరమైన బాధ్యతలపై కూడా ప్రభావం పడుతోందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. దాదాపు 54 శాతం మంది ఉద్యోగులు ఆఫీస్‌లో డేటింగ్ చేయడం వల్ల తమ వర్క్-లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతిన్నదని అంగీకరించారు. అంతేకాకుండా, ఆఫీస్ వ్యవహారాలు ఎక్కువ కాలం రహస్యంగా ఉండవని, సుమారు 60 శాతం మంది ఇవి ఆఫీస్ గాసిప్స్‌కు కారణమవుతాయని తెలిపారు. ఒకవేళ బ్రేకప్ జరిగితే ప్రతిరోజూ అదే వ్యక్తిని ఆఫీస్‌లో ఎదుర్కోవడం మానసికంగా పెద్ద సవాలుగా మారుతుందని చాలామంది భయపడుతున్నారు.
Also Read
- Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
- 3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
- స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
- స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
ఈ రిపోర్ట్‌లో అన్నింటికంటే విస్తుపోయే అంశం ఏమిటంటే.. ఆఫీస్ రిలేషన్షిప్లో ఉన్నవారిలో 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేసి సహోద్యోగులతో సంబంధాలు పెట్టుకున్నట్లు సర్వేలో తేలింది. అదే సమయంలో సుమారు 43 శాతం మంది తమ ఆఫీస్ పార్ట్నర్నే పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారట. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా కంపెనీలు సైతం ఈ విషయంలో నిబంధనలను సడలిస్తున్నాయి. సుమారు 62 శాతం మంది ఉద్యోగులు తమ ప్రేమ వ్యవహారాన్ని స్వయంగా హెచ్ఆర్ (HR) విభాగానికి తెలియజేయడం విశేషంగా మారింది. మొత్తం మీద, ఆఫీస్ ప్రేమలు భావోద్వేగాలకు వేదికగా మారుతున్నప్పటికీ, అవి అనేక సవాళ్లను సైతం వెంటబెట్టుకొస్తున్నాయని ఈ నివేదిక చెబుతోంది.
తాజావార్తలు
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
KKR Playoffs Scenario: అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న కేకేఆర్.. ప్లేఆఫ్స్ సమీకరణాలు ఇవే!
-
Ameesha Patel: పీఆర్ టీమ్స్‌కు డబ్బులిస్తే స్టార్లు అయిపోరు..అమీషా పటేల్ మాస్ వార్నింగ్!
-
Off The Record: రచ్చ రచ్చ అవుతున్న గజ్వేల్ కాంగ్రెస్ గొడవ
-
Team India T20 Captain: శ్రేయస్ అయ్యర్‌కు గట్టి పోటీ.. టీమిండియా కెప్టెన్సీ రేసులో కేరళ స్టార్!