నిర్మాత కేదార్ది సహజ మరణం కాదా? ఆయన చనిపోయినప్పుడు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పక్కనే ఉన్నారా? కేదార్‌కి, బీఆర్‌ఎస్ మాజీలకు ఉన్న లింకేంటి? ఆ టైమ్‌లో దుబాయ్‌లో ఆయన పక్కనే ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరూ ఎవరు? లెట్స్ వాచ్. టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతి మరకలు గులాబీకి అంటుకుంటున్నట్టు కనిపిస్తోంది. మిస్టీరియస్ మరణాలు జరుగుతున్నాయని, అందులో డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్ మృతి కూడా ఒకటని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడంతో మేటర్ మొత్తం పొలిటికల్ టర్న్ తీసుకుంది. కేదార్ సహజంగానో, గుండెపోటుతోనో చనిపోలేదని, మృతిపై అనుమానాలు ఉన్నాయని అన్నారు సీఎం. కేదార్ టాలీవుడ్‌లో బడా ప్రొడ్యూసర్, అంతేకాకుండా.. గత ప్రభుత్వంలో కీలక పెద్దలు, సినీ ప్రముఖుల డబ్బుని దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. డ్రగ్స్‌కు బానిసైన కేదార్ గతంలో హైదరాబాద్‌లో ఒక పబ్‌లో పట్టుపడ్డారు. ఇక అప్పటి నుంచి దుబాయ్‌కి మకాం మార్చి…అక్కడే తెలంగాణకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఒకడుగు ముందుకేసి కేదార్ చనిపోయినప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నట్టు చెబుతున్నారు. వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ మాజీ యువ ఎమ్మెల్యే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే ఆ టైంలో అక్కడ ఉన్నారన్నది కాంగ్రెస్ ఆరోపణ.
ఇందులో ఒక ఎమ్మెల్యేపై గతంలోడ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కేదార్ చనిపోగానే… హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చిన ఒక మాజీ ఎమ్మెల్యే తనకే పాపం తెలియదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారని, నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో మాజీ… కేదార్ మృతదేహాన్ని దుబాయ్ పోలీసులు తీసుకెళ్లే సమయంలో అక్కడే ఉన్నట్టు చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ పాలిటిక్స్‌లో రాజకీయ రచ్చరాజేసిన కేదార్ మృతి ఈ ఇద్దరు ఎమ్మెల్యే చుట్టూ మొదలై… మెల్లిగా వాళ్ల పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో… సీఎం రేవంత్… బీఆర్‌ఎస్ అగ్రనేతలను ఈ ఉచ్చులోకి లాగే ప్రయత్నాన్ని గట్టిగా చేశారన్న విశ్లేషణలున్నాయి. మేడిగడ్డ కూలిపోవడంపై కేసు వేసిన రాజలింగమూర్తి హత్య, కేసు వాదించిన సంజీవ్ రెడ్డి మరణం, డ్రగ్స్ కేసు నిందితుడైన కేదార్ అనుమానస్పద మృతి విషయాల్లో బీఆర్‌ఎస్ నేతలే టార్గెట్గా వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. సో… తీగలాగితే డొంక కదలినట్లు… కేదార్‌ది సహజ మరణం కాదని తేలినా, కుట్ర ఉందని దుబాయ్ పోలీసులు తేల్చినా.. ఆయన వెంట ఉన్న ఇద్దరు మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఆ లింక్‌లో పార్టీ నేతలు ఈ మిస్టిరియస్ డెత్స్‌లో చిక్కుకునే ప్రమాదం ఉందన్న అంచనాలు పెరుగుతున్నాయి. అయితే రేవంత్‌కు పాలన చేతకాకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, విచారణ, దర్యాప్తు కావాలంటే రేవంత్ జరిపించుకోవచ్చు కదా అంటూ కేటీఆర్, కవిత సవాల్ చేశారు. ఈ ఎపిసోడ్ ఎంతదూరం వెళ్తుందో చూడాలి మరి.