NTV Telugu Site icon

Off The Record: కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా పని చేయడం లేదా..? కౌంటర్ చేసుకోలేకపోతున్నారా..?

Congress

Congress

Off The Record: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పవర్‌లోకి వచ్చి 11 నెలలవుతోంది. ఈ టైంలో రాష్ట్రం కోసం చాలా చేసినా… దాన్ని జనానికి సరిగా చెప్పుకోలేకపోతున్నామన్న అసంతృప్తి, అసహనం పెరుగుతున్నాయట ప్రభుత్వ పెద్దల్లో. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపం ఉందా..? ప్రతిపక్ష పార్టీలు ముప్పేట దాడి చేస్తున్నా.. అధికార పక్ష నాయకులు ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు? కనీసం కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నం కూడా ఎందుకు చేయడం లేదు? లోపం ఎక్కడ ఉందన్న చర్చ మొదలైందట. అది నిజంగానే సమన్వయ లోపమా? లేక ప్రతిపక్షం విమర్శించిన మాత్రాన అయ్యేదేంది, పొయ్యేదేందన్న నిర్లక్ష్యమా అన్నది కూడా అర్ధం కాకుండా ఉందంటున్నారు.

Read Also: Honda Activa EV: త్వరలో హోండా ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంచ్.. టీజర్ విడుదల

ప్రతిపక్షాల విమర్శలకి అయితే కోమటిరెడ్డి, లేదంటే పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రులు మాత్రమే స్పందిస్తున్నారు తప్ప… మిగతా వాళ్ళంతా మాకెందుకులే అన్నట్టుగా ఉంటున్నారన్న అభిప్రాయం ప్రభుత్వ పెద్దలతో పాటు కాంగ్రెస్‌ వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రుల సంగతి అలా ఉంచితే… కనీసం పార్టీ వైపు నుంచి కూడా సీనియర్ నేతలు గాని, సీనియర్ అధికార ప్రతినిధులు గాని ఎందుకు మాట్లాడటం లేదన్నది మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌. చివరికి అపోజిషన్‌ లీడర్స్‌ సీఎంని తిట్టినా అడపా దడపా జరిగే సభలు, సమావేశాల్లో స్వయంగా రేవంత్ రెడ్డే కౌంటర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే… సమన్వయ లోపం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నాయి రాజకీయ వర్గాలు. పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్ని కూడా సరిగా ప్రచారం చేసుకోలేని దుస్థితి ఉందని అనుకుంటున్నాయట పార్టీ వర్గాలు. పంట రుణాలపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా… పట్టించుకోవట్లేదని, అసలు ఏం జరుగుతోందన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం జరగడం లేదని, అన్నిటికి సీఎం రేవంత్ రెడ్డే సమాధానం చెప్పుకోవాల్సి రావడాన్ని ఎలా అర్ధం చేసువాలన్న చర్చ జరుగుతోందట తెలంగాణ కాంగ్రెస్‌లోని ఓ వర్గం నాయకుల మధ్య. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ రోజుకో అంశాన్ని అజెండాగా చేసుకుని అటాక్‌ మోడ్‌లోకి వెళ్తోంది. కానీ ప్రభుత్వం వైపు నుంచి దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం మాత్రం సరిగా జరగడం లేదన్న అభిప్రాయం బలపడుతోందట. ఓవైపు విమర్శలు పెరుగుతున్నా… ఇప్పటివరకు ధాన్యం ఎంత కొనుగోలు చేశారు, రైతులకు ఏ మేరకు డబ్బులు ఖాతాలో వేశారు, కొనుగోలు కేంద్రాలలో పరిస్థితి ఏంటన్న అంశాలపై కనీసం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరగడం లేదట.

Read Also: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త బౌలింగ్ కోచ్‌గా మునాఫ్ పటేల్‌..

ఇటీవల మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పార్టీ అధికార ప్రతినిధులతో జూమ్ మీటింగ్‌ పెట్టి అవగాహన పెంచే ప్రయత్నం చేసినా… నాయకులు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవన్నది పార్టీ వర్గాల ఇంటర్నల్‌ టాక్‌. వాస్తవానికి ఇప్పటివరకు ప్రభుత్వం 4 లక్షల 80వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసింది. మొత్తం ఒక వెయ్యి113 కోట్ల విలువైన ధాన్యం కొనగా…. రైతుల ఖాతాల్లోకి 23 కోట్ల రూపాయలు పడ్డాయి. కొనుగోలు కేంద్రాల దగ్గర అధికారులు సరిగా పనిచేయకపోవడం వల్లే… డబ్బు జమలో ఆలస్యం అవుతోందన్న విమర్శలున్నాయి. అసలు వడ్లు కొన్న వెంటనే రైతుల ఖాతాల్లోకి డబ్బు రాదు. కొన్న ధాన్యాన్ని మిల్లర్లకు అందించి… ఆ వివరాల డేటాను ప్రభుత్వ సిబ్బంది ఎంట్రీ చేస్తే… అప్పుడు డబ్బులు రైతుల ఖాతాలోకి వస్తాయి. ఈ ప్రక్రియను అధికార యంత్రాంగం కొంత ఆలస్యం చేయడం వల్లే ఇబ్బందులు వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కొన్ని జిల్లాల్లో అధికారుల నిర్లిప్తత మరీ ఘోరంగా ఉన్నట్టు సమాచారం. వీటన్నిటిని సెట్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన ఆదేశాలైతే ఇస్తున్నారుగానీ… క్షేత్రస్థాయిలో అధికారులు అంత వేగంగా స్పందించడం లేదని తెలుస్తోంది. అలాంటి వాళ్ళని పరుగులు పెట్టించాలంటే… ప్రభుత్వంలోని పెద్దలు వేగంగా స్పందించక తప్పదు. విషయాన్ని రైతులకు వివరించి చెప్పడంలో ప్రభుత్వ యంత్రాంగం అలసత్వంగా ఉంటున్నప్పుడు కనీసం ఇటు పార్టీ వైపు నుంచి అయినా… వివరాలు చెప్పాల్సి ఉందని, వాళ్ళు కూడా ఎందుకు పట్టీ పట్టనట్టు ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో. మొత్తంగా తాము ఎక్కడ వెనకబడుతున్నామో… ప్రభుత్వ, కాంగ్రెస్‌ పెద్దలు తెలుసుకోవాల్సి ఉంది. జోడు గుర్రాల్లా ఉండాల్సిన చోట సమన్వయం లేక చేసింది చెప్పుకోలేకపోతే… అంతిమంగా అంతా నష్టపోతారన్న హెచ్చరికలు సైతం వస్తున్నాయట కాంగ్రెస్‌ నాయకులకు.