Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Sympathy After Chandrababu Arrest In Andhra Pradesh

Off The Record: చంద్రబాబు అరెస్ట్ తర్వాత సానుభూతిపై చర్చ.. ప్లస్సా..? మైనస్సా..?

Published Date :September 26, 2023 , 10:25 pm
By Sudhakar Ravula
Off The Record: చంద్రబాబు అరెస్ట్ తర్వాత సానుభూతిపై చర్చ.. ప్లస్సా..? మైనస్సా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: చంద్రబాబు అరెస్ట్‌ అయ్యారు. 73 ఏళ్ల వయస్సులో జైలుకెళ్లారు. ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటికీ సీఐడీ సరైన ఆధారాలు సేకరించలేకపోయిందన్నది టీడీపీ లీడర్స్‌ అండ్‌ కేడర్‌ మధ్య విస్తృతంగా జరుగుతున్న చర్చ. కానీ, అదే టైంలో మరో విషయాన్ని కూడా మాట్లాడుకుంటున్నారట. బాబు స్థాయి, వయసు, ఇన్నాళ్లు జైల్లో ఉండటం లాంటి వ్యవహారాలను మనలో మనం మాట్లాడుకుంటున్నాం.. అయ్యో పాపం అనుకుంటున్నాం.. సోషల్‌ మీడియాలో హోరెత్తిస్తున్నాంగానీ.. అసలు జనం ఏమనుకుంటున్నారన్న ప్రశ్న వచ్చినప్పుడు క్లారిటీ రావడం లేదట. ఇలాంటి వ్యవహారాల్లో సింపతీ ఫ్యాక్టర్‌ ప్రధానం గనుక ఆ కోణంలో ఆలోచిస్తే.. ఆశించినంత రాలేదన్నది పార్టీలో మెజార్టీ నాయకుల అభిప్రాయంగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఏ ఇద్దరు నాయకులు కలిసినా.. వివిధ కోణాల్లో విశ్లేషించుకుంటూ.. వర్తమానం, భవిష్యత్‌ లెక్కలు వేసుకుంటూ.. సానుభూతి గేమ్‌ ఎలా ఆడితే పూర్తిగా వర్కౌట్‌ అవుతుందా అని మాట్లాడుతుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు జైలుకు వెళ్ళక ముందు పార్టీ గురించి జనం ఏమనుకున్నారు? ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నారని ఆరా తీసే పనిలో ఉన్నారట కొందరు నాయకులు. వాళ్ళ అంచనాల ప్రకారం గతంలో టీడీపీకి గ్రామీణ ప్రాంతాల్లో కొంత ప్రతికూల వాతావరణం ఉండేదని, ఇప్పుడు కొంత మార్పు కనిపిస్తున్నా.. అది ఇంకా ఎక్కువగా రావాల్సిందని, ఆ స్థాయిలో ఎందుకు రాలేదంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ వయసులో ఆయన్ని అలా అరెస్ట్‌ చేసి ఉండకూడదంటూ.. న్యూట్రల్‌గా ఉండేవాళ్ళు అరెస్ట్‌ చేసిన విధానంపై మాట్లాడుకుంటున్నా… అది అక్కడికే పరిమితం అవుతోందని, అంతకు మించి పూర్తి సానుభూతి రూపంలోకి మారడం లేదన్న ఫీడ్‌ బ్యాక్‌ వస్తోంద పార్టీ నేతలకు.

అరెస్ట్‌ తర్వాత భువనేశ్వరి, బ్రాహ్మణి తెర మీదికి వచ్చి కేండిల్‌ ర్యాలీలు నిర్వహించడం వల్ల మహిళల్లో చర్చ మొదలైందంటున్నారు. దాన్ని సానుకూలంగా ఎలా మల్చుకోవాలన్నది పార్టీ నాయకత్వపు నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుందని, ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకుని జనంలోకి తీసుకెళ్ళే పరిస్థితి ఇప్పుడు పార్టీలో ఉందా అన్న చర్చలు కూడా జరుగుతున్నట్టు తెలిసింది. ప్రజల్లో చర్చ జరుగుతున్నంత మాత్రాన సరిపోదని.. దాన్ని రాజకీయంగా ఉపయోగపడేలా మార్చుకోవడంలోనే విషయమంతా ఉందని, అసలు అందుకు సంబంధించిన ప్రణాళికలు ఏవని పార్టీ వర్గాలే ప్రశ్నించుకుంటున్న పరిస్థితి. ఇదే విషయాన్ని చంద్రబాబు కుటుంబ సభ్యుల దగ్గర కొందరు ప్రస్తావించే ప్రయత్నం చేసినా.. అట్నుంచి అంత సానుకూల స్పందన రాలేదని తెలిసింది. అయితే.. కుటుంబ సభ్యులుగా వారి అభిప్రాయాలు వారికున్నా.. రాజకీయంగా కూడా ఆలోచించాలి, పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ఉంది కదా అంటున్నారు కొందరు టీడీపీ నేతలు. రాజకీయంగా సక్సెస్‌ అయితే.. అన్నీ కొట్టుకుపోతాయని.. పొలిటికల్‌ యాంగిల్‌లో ఆలోచించకుంటే మొత్తానికే నష్టపోతామన్న ఆందోళన కేడర్‌లో ఉందట. మొత్తంగా చూస్తే… చంద్రబాబులాంటి అగ్రనాయకుడు అరెస్టయి ఇన్ని రోజుల నుంచి జైల్‌లో ఉంటే… రావాల్సిన రేంజ్‌లో సానుభూతి రాలేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోందంటున్నారు. ముందు ముందు పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Chandrababu Arrest
  • CM YS Jagan
  • off the record
  • tdp

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions