Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Purandeswari And Ntr 100 Coin

Off The Record: ఎన్టీఆర్‌ స్మారక నాణెం.. పురంధేశ్వరి టార్గెట్‌ అయ్యారా..?

Published Date :August 30, 2023 , 10:27 pm
By Sudhakar Ravula
Off The Record: ఎన్టీఆర్‌ స్మారక నాణెం.. పురంధేశ్వరి టార్గెట్‌ అయ్యారా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: ఎన్టీఆర్‌ స్మారక వంద రూపాయల నాణెం విడుదల కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి అంతా తానై వ్యవహరించారు. ఇదే సందర్భంలో లక్ష్మీపార్వతికి ఆహ్వానం పంపలేదు. దీంతో అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారామె. పురంధేశ్వరిని రాష్ట్రం నుంచి తరిమి కొడతానంటూ మంగమ్మ శపథం చేశారు. ఇదే సందర్భంలో బీజేపీ-టీడీపీ మధ్య పొత్తు కుదిర్చేందుకు పురంధేశ్వరి మధ్యవర్తిత్వం వహిస్తున్నారని.. టీడీపీని బీజేపీకి దగ్గరగా చేయడం ద్వారా తమను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది వైసీపీ ఆగ్రహం. పురంధేశ్వరి టీడీపీ ఏజెంటుగా బీజేపీలో పని చేస్తున్నారనే వాదనను చాలా ఎగ్రెసివ్‌గా తెర మీదకు తెస్తోంది వైసీపీ. ఇక సోషల్‌ మీడియాలో వైసీపీ సానుభూతిపరులైతే బీజేపీ అధ్యక్షురాలిని టార్గెట్‌ చేసుకుని చెలరేగిపోతున్నారు. ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయింది.

ఇకపై పురంధేశ్వరి వెళ్లే ప్రతి చోటుకూ తాను వెళ్తాను. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుణ్ని చేయడంలో చంద్రబాబు కంటే ఎక్కువగా కీలక పాత్ర పోషించింది పురంధేశ్వరే అనే రీతిలో లక్ష్మీ పార్వతి చేసిన కామెంట్స్‌పై గరం గరం చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు కంటే పురంధేశ్వరే ఆ ఎపిసోడ్‌లో కీలక పాత్ర పోషించారనే రీతిలో మాట్లాడ్డం.. ఆమెను వదిలేదే లేదని ప్రతిజ్ఞ చేయడం చూస్తుంటే.. భవిష్యత్తులో లక్ష్మీ పార్వతి టార్గెట్‌ పురందేశ్వరేనన్నది రాజకీయ వర్గాల మాట. మరోవైపు వైసీపీ కూడా అదే స్థాయిలో పురంధేశ్వరిని టార్గెట్‌ చేస్తున్నట్టే కన్పిస్తోంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఇలా బాధ్యతలు స్వీకరించారో.. లేదో.. వైసీపీని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేయడమే కాకుండా.. కేంద్రానికి వివిధ సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేశారు. ఈ వ్యవహారాలను వైసీపీ కూడా సీరియస్‌గా తీసుకుందట అధికార పక్షం.

ఇక ఇదే సందర్భంలో ఢిల్లీలో జరిగిన ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి పొలిటికల్‌ టచ్‌ వచ్చింది. ఆ టైంలోనే పొత్తుల చర్చ జరిగిందనే ప్రచారం మొదలైంది. ఆ కార్యక్రమంలో చంద్రబాబు-నడ్డా మాట్లాడుకోవడం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. ఆ తర్వాత కూడా జేపీ నడ్డా-చంద్రబాబు మధ్య చిన్న పాటి చాయ్‌ పే చర్చ జరిగింది. దీంతో బీజేపీ – టీడీపీ దగ్గర అవుతున్నాయా..? అనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలను కలిపేందుకు పవన్ కళ్యాణ్‌ ప్రయత్నిస్తుండగా.. మరోవైపు బీజేపీ ఏపీ అధ్యక్షురాలి హోదాలో పురంధేశ్వరి ట్రయల్స్‌ కూడా చాలా వరకు సఫలమైనట్టే కన్పిస్తున్నాయనేది ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌ టాక్‌. దీనికి తగ్గట్టే ఢిల్లీలో చంద్రబాబు మీడియా ప్రతినిధులతో చేసిన చిట్‌ చాట్‌లో కూడా బీజేపీకి తాను వ్యతిరేకం కాదని చెప్పే ప్రయత్నం చేశారు. ఇదంతా చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ టార్గెట్‌గా పొత్తుల రాజకీయం తెర లేస్తోందనే భావన బలంగా వ్యక్తమవుతోందంటున్నారు. దీనికి పురంధేశ్వరి కీలక పాత్ర పోషిస్తున్న క్రమంలో ఆమెను ఇప్పటి నుంచే టార్గెట్‌ చేసుకోవాలని వైసీపీ భావిస్తున్నట్టుగా కన్పిస్తోంది. మరోవైపు లక్ష్మీ పార్వతి పురంధేశ్వరిని టార్గెట్‌ చేస్తోన్నా.. బీజేపీ నుంచి ఎవ్వరూ పెద్దగా రియాక్ట్‌ కాలేదు. ఆమెను మరింత టార్గెట్‌ చేస్తే ఒంటరి అవుతారా..? లేక పార్టీ నుంచి ఏమైనా సహకారం ఉంటుందా..? అన్న చర్చ మొదలైంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ntr 100 coin
  • off the record
  • Purandeswari

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions