Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Left Parties And Congress In Telangana

Off The Record: తెలంగాణలో లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల వేళ కలిసి నడుస్తాయా..?

Published Date :April 4, 2024 , 10:00 pm
By Mahesh Jakki
Off The Record: తెలంగాణలో లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల వేళ కలిసి నడుస్తాయా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: తెలంగాణలో లెఫ్ట్‌ పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి నడుస్తున్నట్టా? లేనట్టా? అసెంబ్లీ ఎన్నికల నాటి సహకారం ఈసారి కూడా ఉంటుందా? లేదా? అసలు కామ్రేడ్స్‌ ఏం కోరుకుంటున్నారు? కాంగ్రెస్‌ నాయకత్వం మనసులో ఏముంది? అసెంబ్లీకి, ఇప్పటికి వచ్చిన మార్పేంటి? వాళ్ళు దోస్తులా ? దుష్మన్‌లా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐతో పొత్తు పెట్టుకుని పని చేసింది కాంగ్రెస్‌. కొత్తగూడెం సీటును కేటాయించింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నాసరే… పొత్తు ధర్మంలో భాగంగా ఇవ్వడం, సమన్వయంతో కలిసి పనిచేసి సీపీఐ గెలవడం తెలిసిందే. అలాగే కమ్యూనిస్ట్‌లు బలంగా ఉన్న కొన్నిచోట్ల కాంగ్రెస్‌కి కూడా వర్కౌట్‌ అయింది. ఇలా రెండు పార్టీలు పరస్పరం లాభపడ్డాయి. కానీ… లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి ఆ సుహృద్భావం కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటివరకు రెండు పార్టీల మధ్య ఎంపీ ఎలక్షన్స్‌ గురించి అసలు సంప్రదింపులే జరగలేదు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లోనే… తమకో సీటు కావాలని డిమాండ్‌ చేసింది సీపీఐ. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకున్నా… ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగస్వాములం కాబట్టి… మాకో సీటు అంటోంది సీపీఎం. కానీ రాష్ట్ర కాంగ్రెస్ మాత్రం ఈ రెండు పార్టీల డిమాండ్లను పెద్దగా పట్టించుకోలేదు. ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారాలను జాతీయ నాయకత్వమే చూసుకుంటోంది. కాబట్టి ఉభయ కమ్యూనిస్టుల జాతీయ నాయకత్వాలు ఏఐసీసీ పెద్దలతో మాట్లాడి సీట్ల సర్దుబాటు చేసుకోవాలనేది టీ పీసీసీ ఆలోచనగా తెలిసింది. పొత్తుల అంశంపై జాతీయ నాయకత్వం నిర్ణయం మేరకే కట్టుబడి ఉంటామని ఇటీవల స్పష్టం చేసింది సీపీఐ.

అంటే… పరిస్థితులకు అనుగుణంగా ఆ పార్టీ సీటు డిమాండ్‌ నుంచి వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఇక సిపిఎం అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి రానందున ఇప్పుడు పిలిచి టికెట్ ఇచ్చే ఆలోచనలో లేదు కాంగ్రెస్‌. ఇప్పటికే సిపిఎం భువనగిరిలో అభ్యర్థిని ప్రకటించింది. అయినా కాంగ్రెస్ పెద్దగా పట్టించుకోలేదు. భావ సారూప్యత ఉన్న పార్టీలను కలుపుకుని పోవాలని అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రయత్నించింది కాంగ్రెస్‌. కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదన్నది ఇంటర్నల్‌ టాక్‌. సీటు విషయంలో ఇప్పుడు సిపిఐ కొంత వెనక్కి తగ్గినా… ఉభయ కమ్యూనిస్టులతో కాంగ్రెస్ నాయకత్వం మాట్లాడటం లేదన్న అసంతృప్తి మాత్రం కనిపిస్తోంది. నల్గొండ, భువనగిరి, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులు ప్రభావం ఎక్కువ. అందుకోసమైనా… కాంగ్రెస్ పెద్దలు కమ్యూనిస్ట్‌లతో సంప్రదింపులు జరిరిపితే మంచిదన్న చర్చ జరుగుతోంది. అయితే… అభ్యర్థుల ఎంపిక మొత్తం పూర్తయ్యాక ప్రచారంలో మిగతా పార్టీలను కలుపుకోవాలన్నది కాంగ్రెస్‌ ఆలోచనగా తెలిసింది. ఏదేమైనా కాంగ్రెస్‌తో లెఫ్ట్‌ పార్టీలు కలిసి నడిస్తే… ఉభయ పక్షాలకు మంచిదన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఓట్లు చీలిపోతే వచ్చే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని అడుగులు వేయాల్సి ఉంటుందన్న మాట కూడా వినిపిస్తోంది. సూచనలు, సలహాల సంగతి ఎలా ఉన్నా… కాంగ్రెస్‌ పార్టీ ఇంతవరకు తమను సంప్రదించలేదన్న అసహనం మాత్రం కమ్యూనిస్ట్‌ పార్టీల్లో కనిపిస్తోంది. దీంతో వాళ్ళు దగ్గరా దూరమా అన్న డౌట్స్‌ కూడా పెగురుతున్నాయి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • cpi
  • CPM
  • Left parties
  • off the record

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions