Off The Record: దువ్వాడకు వైసీపీలోకి నో రీ ఎంట్రీ?.. రీల్స్ రాజా పొలిటికల్ కెరీర్ ఖతం అయినట్టేనా..?

  • దువ్వాడ శ్రీనివాస్‌కు వైసీపీలోకి నో రీ ఎంట్రీ?..
  • పార్టీలో ఉన్నప్పుడు, వెళ్ళాకా.. డ్యామేజ్‌ చేశారన్న అభిప్రాయం..
  • మాధురి ఎపిసోడ్‌తో ప్రజల్లో చులకన భావం ఏర్పడిందన్న కోపం..
  • వైసీపీ సస్పెండ్‌ చేశాక అన్ని పార్టీల్లో చేరేందుకు ప్రయత్నాలు..
  • ఏ పార్టీ గేటు దాక కూడా రానివ్వలేదన్న టాక్‌..
  • జగన్‌ను కలిసేందుకు దువ్వాడ చేసిన ప్రయత్నాలు విఫలం..
  • రీ ఎంట్రీ లేదని వైసీపీ నుంచి తాజాగా క్లియర్‌ మెస్సేజ్‌?..
  • సన్నిహితురాలు మాధురితో కలిసి హైదరాబాద్‌లో చీరల వ్యాపారం..
  • సోషల్‌ మీడియాలో వేసిన వేషాలను జగన్‌ చీదరించుకున్నారా?..
  • దువ్వాడకు మిగిలింది సోషల్‌ రీల్సేనన్న సెటైర్స్‌..
Otr Duvvada Srinivas

Otr Duvvada Srinivas

Off The Record: రాజకీయాల్లో హత్యలు ఉండవు, అన్నీ ఆత్మహత్యలే ఉంటాయన్నది విస్తృతాభిప్రాయం. చాలామంది నేతలు తమ చేష్టలతో వివిధ సందర్భాల్లో దాన్ని నిరూపించి చూపించారు కూడా. ఇప్పుడు ఆ లిస్ట్‌లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ చేరినట్టు చెప్పుకుంటున్నాయి రాజకీయవర్గాలు. కుటుంబ వివాదాలు, సన్నిహితురాలి ఎపిసోడ్‌ రచ్చ రచ్చ అయ్యాక…. తనకు రాజకీయ అవకాశం ఇచ్చిన వైసీపీ గెంటేసింది. ఇక ఆ పార్టీలోకి రీ ఎంట్రీ అన్న మాటే లేదని ఫ్యాన్‌ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. దువ్వాడ లోపల ఉన్నప్పుడు డ్యామేజ్ చేశారు, వదిలి వెళ్ళాక కూడా అదే జరిగిందన్నది వైసీపీ పెద్దల అభిప్రాయం అట. వ్యక్తుల జీవితాలు వారి సొంతం అయినా…. ఇక్కడ పర్సనల్‌ లైఫ్‌ కూడా పబ్లిక్‌ అయిపోయి అది సోషల్‌ మీడియాలో శృతి మించి ప్రజల్లో పార్టీ పట్ల కూడా చులకన భావం కలగజేసిందంటూ వైసీపీ అధిష్టానం బాగా కోపంగా ఉన్నట్టు సమాచారం. కుటుంబం కన్నా, రాజకీయాల కన్నా… తనకు మాధురే ముఖ్యమని మీడియా ముఖంగా ఎప్పుడో చెప్పారు దువ్వాడ శ్రీనివాస్‌. ఆ క్రమంలోనే.. ఆయన్ని శాశ్వతంగా దూరం పెట్టాలని వైసీపీ హైకమాండ్ డిసైడైందట. ఫ్యాన్‌ అధిష్టానం సస్పెండ్‌ చేశాక… టీడీపీ, జనసేన, బీజేపీ… ఇలా అన్ని పార్టీల్లోకి ట్రై చేశారు దువ్వాడ. కానీ… ఎవరూ ముఖ ద్వారం కాదు కదా.., ప్రవహరీ గోడ గేటు కూడా తాకనివ్వలేదు. పార్టీలో ఉన్నప్పుడు, వెళ్లిపోయాక చేసిన వైసీపీకి చేసిన డ్యామేజ్‌ని చూస్తూ కూడా… ఆ మరకలు మనం అంటించుకోవడం ఎందుకన్న చర్చలు ఆయన టచ్‌ చేసిన ప్రతి పార్టీలోనూ జరిగినట్టు చెప్పుకుంటున్నాయి రాజకీయవర్గాలు.

ఇక ఎక్కడా ఛాన్స్‌ లేకపోవడంతో… తిరిగి వైసీపీ గూటికే చేరేందుకు, జగన్‌ని కలిసేందుకు శ్రీనివాస్‌ చాలాసార్లు ట్రై చేశారట. గతంలో అసెంబ్లీ బయట కలిసి రిక్వెస్ట్ చేశారు. అప్పటికప్పుడు కాదనలేక… వచ్చి కలవమని చెప్పినా, ఆయన మాత్రం అఫీషియల్‌గా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. దాంతో వైసీపీ డోర్లు పూర్తిగా క్లోజ్ అయ్యాయని దువ్వాడకు అర్థమైందట. అందుకు తగ్గట్టే ఇటీవల వైసీపీ హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి క్లియర్‌ మెసేజ్‌ వచ్చినట్టు తెలిసింది. ఇక రీ ఎంట్రీ ఉండబోదని నిర్మొహమాటంగా చెప్పేశారట. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ విషయంలో అంత స్ట్రాంగ్‌గా నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే… ఆయన వల్ల జరిగిన, జరిగే డ్యామేజ్‌ అంతా ఇంతా కాదన్నది తాడేపల్లి టాక్‌. దువ్వాడను గనుక తిరిగి తీసుకుంటే, పార్టీ మొత్తం కామెడీ అయిపోతుందని, టెక్కలి నియోజకవర్గం ఒక్కటే కాదు…, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మొత్తంలో ఓడిపోతామని వైసీపీ హైకమాండ్‌కు క్లారిటీ వచ్చేసిందట. అందుకే దువ్వాడతో ఎవర్నీ కలవొద్దని కూడా అగ్రనేతలు ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన గనుక పార్టీలోకి రీ ఎంట్రీ ఇస్తే… అదే టీడీపీకి పెద్ద ఆయుధం అవుతుందని, మరో కొత్త సమస్య తలెత్తుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తోందని అంటున్నారు.

×
×
Ad

ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్‌కు ఆయన కుటుంబం పూర్తిగా దూరమైంది. తన సన్నిహితురాలు మాధురితో కలిసి హైదరాబాద్‌లో చీరల వ్యాపారం ప్రారంభించి ఆ వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే పనిలో ఉన్నారట. అదే సమయంలో తిరిగి పొలిటికల్‌గా యాక్టివ్‌ అయ్యేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టినట్టు చెప్పుకుంటున్నారు. శ్రీనివాస్‌ తన సన్నిహితురాలు మాధురితో కలిసి సోషల్‌ మీడియాలో వేస్తున్న వెర్రి వేషాలు, పిచ్చి చేష్టలను చూసి పార్టీ అధ్యక్షుడు జగన్‌ చీదరించుకున్నారన్నది వైసీపీ ఇంటర్నల్‌ టాక్‌. అందుకే… రీ ఎంట్రీ ఉండబోదని క్లియర్‌గా, క్లారిటీగా చెప్పేసినట్టు తెలిసింది. ఈ సమాచారం అందుకున్న పార్టీ నేతలు, పాత సహచరులు కొందరు ఇక దువ్వాడకు మిగిలింది సోషల్‌ మీడియాలో రీల్స్‌ మాత్రమేనని సెటైరికల్‌గా మాట్లాడుకుంటున్నారు. అయితే…. ఆయన మాత్రం ఎవరేమనుకున్నా… నా టార్గెట్‌ నాదేనని అంటున్నట్టు చెబుతున్నాయి సన్నిహిత వర్గాలు. తనకు ఏ పార్టీ టిక్కెట్‌ ఇవ్వకున్నా… వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలన్నది ఎమ్మెల్సీ ఆలోచనగా తెలుస్తోంది. టెక్కలి వైసీపీ కేడర్‌ కొంత… ఇప్పటికీ దువ్వాడకు టచ్‌లో ఉంది. వాళ్ళతోనే తాను తిరిగి పుంజుకునే ప్రయత్నంలో ఉన్నారట. అందుకు తగ్గట్టే… నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా… ఠక్కున వచ్చి వచ్చి వాలిపోతున్నారు దువ్వాడ, మాధురి జంట.
ఇదంతా క్షేత్ర స్దాయిలో బలం తగ్గకుండా తీసుకుంటున్న జాగ్రత్తేనని అంటున్నారు పరిశీలకులు.