Off The Record: కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్..? బీఆర్ఎస్ నేతలు క్యూలో ఉన్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: లోక్‌సభ ఎన్నికల ముంగిట్లో తెలంగాణ కాంగ్రెస్… గేట్లెత్తిందా? ఆపరేషన్ ఆకర్ష్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? అంటే.. అవుననే అంటున్నాయి జరుగుతున్న పరిణామాలు. వివిధ కారణాలతో బయటకు వెళ్లిపోయిన పాత నాయకులను తిరిగి రప్పించడంపై అధి నాయకత్వం సీరియస్‌గా దృష్టిపెట్టినట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు.. రాజకీయ ప్రత్యర్థులపై పంజా గట్టిగానే విసరాలని సీఎం డిసైడైనట్టు ప్రచారం జరుగుతోంది. దాని చుట్టూనే ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది. ఢిల్లీ టూర్లో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకు పార్టీ ప్రధాన కారుదర్శి కేసీ వేణుగోపాల్ తో కండువా కప్పించారు సీఎం రేవంత్‌రెడ్డి. అదే సమయంలో మన్నే జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ టిక్కెట్ కోసం ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఈ పరిణామాన్ని .. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపినట్టుగానే చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 12 ఎంపీ సీట్లు గెలవాలన్న కసిగా ఉంది తెలంగాణ కాంగ్రెస్.
సీఎంగా రేవంత్‌రెడ్డి ఎదుర్కోబోతున్న తొలి ఎన్నిక కావడంతో ఆయనకు కూడా ఇది సవాల్‌గా మారిందట. రాష్ట్రంలో అధికారం లోకి రావడం ఒక ఎత్తయితే… వచ్చిన అధికార బలంతో పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపించి ఇవ్వడమన్నది మరో ఎత్తుగా భావిస్తున్నాయి రాజకీయవర్గాలు. సీఎంకి ఇది మేజర్ టాస్క్ కాబట్టి చేరికలు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి నాయకులు కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నట్టు స్పష్టం చేస్తున్నాయి తాజా పరిణామాలు. వెంకటేష్ నేతతో పాటు.. బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు కూడా కాంగ్రెస్‌కు క్యూలో ఉన్నారనే టాక్ మొదలయింది. అలాగే మాజీ మంత్రి రాజయ్య కూడా గులాబీ కండువా తీసు పక్కన పెట్టేశారు. ఇప్పుడాయన మూడు రంగుల కండువా కప్పుకోవడం ఎప్పుడన్నది మాత్రమే తేలాల్సి ఉంది.
Also Read
- Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
- Delhi: నిరసనకారులపై కేసులు కొట్టేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ఒక్క షరతు!
- Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
- Metro Express: కరీంనగర్లో 'సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్' బస్సులు ప్రారంభం.. ఈ రూట్లల్లో అందుబాటులోకి..
ఇక, రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కూడా పార్టీ మారతారన్న ప్రచారం ఉంది. మరో సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి మీద కూడా రూమర్స్ నడుస్తున్నాయి. రంజిత్ రెడ్డి కారు దిగేయడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది. ఎంపీతోపాటు ఆయనకు సన్నిహితంగా ఉండే మరో నేత కూడా కాంగ్రెస్ గూటికి చేరతారన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. మొత్తంగా ప్రస్తుత వాతావరణాన్ని చూస్తుంటే…. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు భారీగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మరి కొందరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి గులాబీ రేకులు ఎన్ని రాలిపోతాయో, అలా రాలకుండా పార్టీ అధిష్టానం ఏం ట్రీట్మెంట్ ఇస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
Delhi: నిరసనకారులపై కేసులు కొట్టేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ఒక్క షరతు!
-
Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
-
SIIMA 2026 Nominations: సైమా 2026 నామినేషన్స్ వచ్చేశాయ్.. తెలుగు నుంచి ఈ సినిమాదే హవా!
-
ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!