Draupadi Murmu : ఒడిశాలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటనలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బరిపడాలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ వివాదం ముగియక ముందే మరో అంశం తెరపైకి వచ్చింది. రాష్ట్రపతి హెలికాప్టర్ వద్ద సెల్ఫీలు దిగిన ఫార్మసిస్ట్‌ను మయూర్‌భంజ్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ (CDMO) సస్పెండ్ చేశారు. ఈ మేరకు వివరాలు సోమవారం ఓ అధికారి వెల్లడించారు.
Read Also: Vande Bharat Train: వందే భారత్ రైలుకు తప్పిన ప్రమాదం.. ఈసారి ఎక్కడంటే..
రాష్ట్రపతి హెలికాప్టర్ వద్ద ఫోటోలు దిగి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినందుకు ఫార్మసిస్ట్ జశోబంతా బెహెరాను సీడీఎంవో డాక్టర్ రూపభాను మిశ్రా సస్పెండ్ చేసినట్లు అధికారి తెలిపారు. సస్పెండ్ చేయబడిన ఫార్మసిస్ట్ బెహెరా.. మే 5న సిమ్లిపాల్ నేషనల్ పార్క్‌ను సందర్శించినప్పుడు రాష్ట్రపతి వైద్య బృందంలో నియమించబడ్డారు. రాష్ట్రపతి ప్రయాణించే వాహనంపై సెల్ఫీ తీసుకోవటాన్ని భద్రతాలోపంగా భావించారు. పలువురు విమర్శించారు. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు యశ్వంత్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మే 5న సిమిలిపాల్ నేషనల్ పార్కును సందర్భంగా సందర్భంగా రాష్ట్రపతి వైద్య బృందంలో బెహెరాను నియమించారు. ఈ సందర్భంగా బెహెరా హెలికాఫ్టర్ తో సెల్పీ తీసుకోవటంతో సస్పండ్ అయ్యారు.
Read Also:Tomato Prices Down: టమోటా రైతుల ఆవేదన.. కేజీ 2 రూపాయలే