Ruksana Bano Dies: ప్రముఖ లేడీ సింగర్ మృతి.. విషం ఇచ్చారని ఆరోపణలు! ఇండస్ట్రీలో హాట్ టాపిక్
- లేడీ సింగర్ రుక్సానా బానో మృతి
- స్క్రబ్ టైఫస్ వ్యాధి కారణం
- విషమిచ్చి చంపారంటున్న తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odia Singer Ruksana Bano Dead at 27: 27 ఏళ్లకే ప్రముఖ లేడీ సింగర్ రుక్సానా బానో మృతిచెందారు. బుధవారం (సెప్టెంబర్ 18) రాత్రి భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. రుక్సానా మరణానికి ఖచ్చితమైన కారణాన్ని డాక్టర్లు వెల్లడించలేదు. అయితే ‘స్క్రబ్ టైఫస్’ వ్యాధి కారణంగానే ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. ఏదైనా క్రిమి లేదా విషపురుగు కాటు వేస్తే ఈ వ్యాధి సోకుతుంది. జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, దద్దుర్లు లాంటివి ఈ వ్యాధి సాధారణ లక్షణాలు.
ఒడిశాలోని సంబల్‌పూర్‌కి చెందిన ఆల్బమ్ సాంగ్స్ పాడుతూ రుక్సానా బానో బాగానే గుర్తింపు తెచ్చకున్నారు. ఒడియా సాంగ్స్ పాడుతూ ఫేమస్ అయిన ఆమెకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. 15 రోజుల క్రితం ఓ సాంగ్ షూటింగ్ కోసం బోలంగిర్ ఊరు వెళ్లారు. ఆగస్టు 27న జ్యూస్ తాగి షూటింగ్ చేస్తున్నప్పుడు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను భవానీపట్నలోని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స తర్వాత బోలంగిర్‌లోని భీమా భోయ్ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. రుక్సానా పరిస్థితి క్షీణించడంతో బర్గర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కి తరలించారు. అప్పటి నుంచి ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి కన్నుమూశారు.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
Also Read: Weekend OTT Movies: ఈ వీకెండ్‌కు 24 సినిమాలు.. అందరి చూపు మాత్రం ఆ రెండు సినిమాలపైనే!
చిన్న వయసులోనే రుక్సానా బానో చనిపోవడం అభిమానులకు షాక్‌కి గురి చేసింది. రుక్సానా బానో మరణంపై ఆమె తల్లి, సోదరి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రుక్సానాకు గతంలో బెదిరింపులు వచ్చాయని వారు పేర్కొన్నారు. రుక్సానాకు ప్రత్యర్థి సింగర్ విషమిచ్చి చంపేసిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు ఈ విషయం ఒడిశా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!