NTV Telugu Site icon

World Cup 2023: కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన సూర్యకుమార్ యాదవ్‌.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!

Untitled Design (3)

Untitled Design (3)

Suryakumar Yadav Caught Eating in Dugout During IND vs AUS Match: 2023 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 8) చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి మెగా టోర్నీలో బోణీ కొట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. టీమిండియా స్పిన్ మాయాజాలానికి 199 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్‌ 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ ఇబ్బందికరమైన క్షణాన్ని ఎదుర్కొన్నాడు.

లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ వికెట్స్ కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. ముగ్గురు డకౌట్ కావడంతో భారత్ 2 పరుగులకే 3 వికెట్స్ కోల్పోయింది. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నా.. భారత్ ఫాన్స్ మదిలో తెలియని భాయాందోళన మొదలైంది. అందరూ మ్యాచ్ ఉత్కంఠంగా చుస్తున్నారు. డగౌట్‌లో ఉన్న టీమిండియా ప్లేయర్స్ కూడా ఆసక్తిగా మ్యాచ్ చుస్తున్నారు. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్‌ తింటూ ఉన్నాడు.

Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు! నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?

డకౌట్ అయి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ మ్యాచ్ చూస్తుండగా.. పక్కనే ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ మాత్రం హాయిగా తింటున్నాడు. ఈ దృశ్యం కెమెరాకు చిక్కింది. తనను కెమెరా కవర్ చేస్తుందని గ్రహించిన సూర్య.. నమలకుండా అలానే ఉండిపోయాడు. అంతేకాదు కెమెరా వైపు ఓ లుక్ కూడా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ సూర్యను ఓ ఆటాడుకుంటున్నారు. కీలక వికెట్స్ పోయి కష్టాల్లో ఉన్న సమయంలో ఎలా తింటున్నావ్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Show comments