UP: ఎంతకు తెగించారు.. AIతో టీచర్ అశ్లీల ఫోటోలు సృష్టించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్
- AIతో టీచర్ అశ్లీల ఫోటోలు సృష్టించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్
- యూపీలోని మొరాదాబాద్ జిల్లాలో ఘటన
- 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు చేసిన సిగ్గుమాలిన చర్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని మొరాదాబాద్ జిల్లాకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల సిగ్గుమాలిన చర్య వెలుగులోకి వచ్చింది. ప్రతిష్టాత్మక పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అన్ని పరిమితులను అధిగమించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో విద్యార్థులు తమ టీచర్ అశ్లీల ఫోటోలు సృష్టించి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ చేశారు. అంతేకాకుండా.. మరికొందరు టీచర్లు, విద్యార్థినుల ఫొటోలను కూడా వైరల్ చేస్తానని బెదిరించారు. బాధిత ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు సివిల్ లైన్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Minimum Wage Rates: కార్మికులకు కేంద్రం శుభవార్త.. కనీస వేతనాలు పెంపు
Also Read
- KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
- Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
- Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
- Rohit Sharma: ‘ఇంకా ఆ పని పూర్తి కాలేదు’.. రిటైర్మెంట్‌పై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సంచలన ప్రకటన..
సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న ఓ స్కూల్ టీచర్ తన స్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసింది. టీచర్ తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు AI ద్వారా తన ఫోటోను అసభ్యకరంగా చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లోని వివిధ విద్యార్థుల గ్రూప్‌లలో షేర్ చేసారు. అలాగే.. విద్యార్థులు మరికొందరు ఉపాధ్యాయులు, విద్యార్థినుల ఇలాంటి ఫోటోలను రూపొందించి వాటిని వైరల్ చేస్తామని వారు బెదిరించినట్లు టీచర్ చెప్పింది. అయితే.. టీచర్ ఫోటో వైరల్ అయినప్పటి నుంచి ఆమె మానసిక ఒత్తిడికి లోనైంది.
PM Modi: రూ.130 కోట్లతో తయారు చేసిన సూపర్ కంప్యూటర్లను ప్రారంభించిన మోడీ..
ఈ విషయమై ఎస్‌హెచ్‌ఓ సివిల్ లైన్స్ మనీష్ సక్సేనా స్పందిస్తూ.. ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు ఇద్దరు విద్యార్థినులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సైబర్ సెల్ సాయంతో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూసినా తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా.. ఇన్‌స్టాగ్రామ్ నుండి ఉపాధ్యాయురాలి ఫోటోను తొలగించడానికి సైబర్ సెల్ కూడా కృషి చేస్తోందని చెప్పారు.
తాజావార్తలు
-
KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
-
Asian Games 2026 Badminton: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశ.. పీవీ సింధు ఓటమితో పతకాల ఆశలు ఆవిరి
-
Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
-
Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
-
Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?