NTV Telugu Site icon

UP: ఎంతకు తెగించారు.. AIతో టీచర్ అశ్లీల ఫోటోలు సృష్టించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్

Ai

Ai

యూపీలోని మొరాదాబాద్ జిల్లాకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల సిగ్గుమాలిన చర్య వెలుగులోకి వచ్చింది. ప్రతిష్టాత్మక పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అన్ని పరిమితులను అధిగమించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో విద్యార్థులు తమ టీచర్ అశ్లీల ఫోటోలు సృష్టించి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ చేశారు. అంతేకాకుండా.. మరికొందరు టీచర్లు, విద్యార్థినుల ఫొటోలను కూడా వైరల్ చేస్తానని బెదిరించారు. బాధిత ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు సివిల్ లైన్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Minimum Wage Rates: కార్మికులకు కేంద్రం శుభవార్త.. కనీస వేతనాలు పెంపు

సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న ఓ స్కూల్ టీచర్ తన స్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసింది. టీచర్ తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు AI ద్వారా తన ఫోటోను అసభ్యకరంగా చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లోని వివిధ విద్యార్థుల గ్రూప్‌లలో షేర్ చేసారు. అలాగే.. విద్యార్థులు మరికొందరు ఉపాధ్యాయులు, విద్యార్థినుల ఇలాంటి ఫోటోలను రూపొందించి వాటిని వైరల్ చేస్తామని వారు బెదిరించినట్లు టీచర్ చెప్పింది. అయితే.. టీచర్ ఫోటో వైరల్ అయినప్పటి నుంచి ఆమె మానసిక ఒత్తిడికి లోనైంది.

PM Modi: రూ.130 కోట్లతో తయారు చేసిన సూపర్ కంప్యూటర్లను ప్రారంభించిన మోడీ..

ఈ విషయమై ఎస్‌హెచ్‌ఓ సివిల్ లైన్స్ మనీష్ సక్సేనా స్పందిస్తూ.. ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు ఇద్దరు విద్యార్థినులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సైబర్ సెల్ సాయంతో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూసినా తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా.. ఇన్‌స్టాగ్రామ్ నుండి ఉపాధ్యాయురాలి ఫోటోను తొలగించడానికి సైబర్ సెల్ కూడా కృషి చేస్తోందని చెప్పారు.