Site icon NTV Telugu

Obesity in children: పిల్లల్లో పెరుగుతున్న స్థూలకాయం.. పరిష్కార మార్గాలు లేవా..?

Obesity In Children

Obesity In Children

Obesity in children: ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో స్థూలకాయం (Obesity) వేగంగా పెరుగుతున్న సమస్యలలో ఒకటి. ఇప్పుడు ఇది తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారింది. అందరికి తెలిసినట్లుగానే.. ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ స్క్రీన్ టైమ్, ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్‌ల వినియోగం ఎక్కువగా ఇవ్వడమే. దీనిని అధిగమించాలంటే జీవనశైలి మార్పు తప్పనిసరి. జీవనశైలి మార్పు ద్వారా ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. సరైన మార్గనిర్దేశనం, ఆరోగ్యకరమైన ఇంటి వాతావరణం వంటి సానుకూల విధానాలతో పిల్లలకు ఆరోగ్యవంతమైన బరువును కొనసాగించడంలో సహాయపడవచ్చు.

Read Also: Airtel vs Jio: ఎంట్రీ లెవల్ బ్రాడ్‌ బ్యాండ్ ప్లాన్‌లో భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో లలో ఏది బెస్ట్ ఛాయిస్..?

నిజానికి ప్రస్తుత జీవనశైలి మార్పులే పిల్లల్లో స్థూలకాయాన్ని భారీగా పెంచుతున్నాయి. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, స్వీట్స్, అధిక కేలరీలు కలిగి తక్కువ పోషక విలువ గల ఆహారాలను తినడం ఇందుకు ప్రధాన కారణం. అలాగే, శారీరక చర్యలు తగ్గిపోవడం కూడా ఓ ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇంట్లోనే ఉండి టీవీ చూడటం, వీడియో గేమ్స్ ఆడటం, మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ల వాడకంతో పిల్లలు ఎక్కువగా కూర్చునే చేసే పనులకు అలవాటు పడుతున్నారు. దీని వల్ల కాలరీలు తక్కువగా కఖర్చు కావడం ద్వారా.. బరువు పెరుగుతుంది.

మరోవైపు పిల్ల తల్లిదండ్రులు బిజీ షెడ్యూల్స్ కారణంగా రెడీ ఫుడ్ లేదా హోటల్స్‌లో భోజనం చేయడం వంటి పనులు ఎక్కువయ్యాయి. ఇవి అధిక ఫ్యాట్, చక్కెర, ఉప్పు కలిగి ఉంటాయి. ఇంటి వద్ద తయారయ్యే ఆహారం, కుటుంబ భోజనాలు చాలా వరకు తగ్గిపోతున్నాయి. పాఠశాలల్లో సరైన పోషకాహారంపై అవగాహన లేకపోవడం లేదా ఆరోగ్యకరమైన భోజనం అందుబాటులో లేకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. మరి స్థూలకాయం పెరుగుతున్న నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేయాల్సిన చర్యలను చూసినట్లయితే..

Read Also: Reliance Jio: గేమర్స్‌కు గుడ్‌న్యూస్.. రూ.48 ప్రారంభ ధరతో కొత్త గేమింగ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు లాంచ్..!

ఇందులో మొదటగా ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కల్పించాలి. అలాగే ప్రతిరోజూ వ్యాయామాన్ని ప్రోత్సహించాలి. ఇంకా మంచి సహాయక వాతావరణాన్ని పిల్లలకు కల్పించాలి. ముఖ్యంగా ఈ విధానాలను అనుసరించడంలో తల్లిదండ్రులు ఆదర్శంగా నిలవాలి. తల్లిదండ్రులు ఆరోగ్యకరమైన ఆహారం తిని వ్యాయామం చేస్తే, సంతోషంగా జీవిస్తే పిల్లలు కూడా అదే దారిలో సాగుతారు.

Exit mobile version