Srinivas Goud : ఏ పార్టీ నోట విన్నా ఓబీసీలకు అన్యాయం జరిగిందని అంటున్నాయని, రాహుల్ గాంధీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీలు ఓబీసీ గురించి మాట్లాడుతున్నాయన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇవాళ ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ఇన్ని ఏళ్ళు దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అని, ఇప్పుడు ఓబీసీ కులగణన వీళ్లకు గుర్తుకు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. బ్రిటీష్ కాలంలో కులగణన జరిగిందని, 65 శాతం ఉన్న ఓబీసీల కులగణన ఎంతో తెలియదన్నారు శ్రీనివాస్ గౌడ్. ఓబీసీల కులగణన జరిగితే ప్రభుత్వాలపై తిరుగుబాటు వస్తుందని భయపడ్డారని, కులగణన చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. బీహార్, మహారాష్ట్ర ఓబీసీ కులగణన చేస్తామంటే కేంద్రం ఒప్పుకోలేదని, ఓబీసీలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలన్నారు శ్రీనివాస్ గౌడ్. బీహార్ లో 63.1 శాతం ఓబీసీలు ఉన్నట్లుగా కులగణనలో తేలిందని, మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలన్నారు శ్రీనివాస్ గౌడ్.
Jammu Kashmir: ఆర్మీ వాహనంపై దాడి.. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం..
అంతేకాకుండా..’దేశంలో అన్ని వర్గాల లెక్కలు ఉండాలి. కులగణన చేసే అధికారం రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. బీసీ డిక్లరేషన్ వలనే బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణనపై ముందుకు వెళ్ళాలి. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల విషయంలో ఏదో సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేయవద్దు.’ అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
CV Anand IPS: ఇది కర్ఫ్యూ కాదు.. దీపావళి పండుగకు ఎలాంటి ఆంక్షలు లేవు..