Oasis Fertility Scam: ఒయాసిస్ ఫెర్టిలిటీ కేసులో భారీ మలుపు.. సీఓఓ సహా ఇద్దరు ఉన్నతాధికారుల అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oasis Fertility Scam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్స్ అక్రమ అండాల సేకరణ, అక్రమ సంతాన సాఫల్య (ART) రాకెట్ కేసు దర్యాప్తులో మల్కాజ్గిరి కమిషనరేట్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 1145/2026 కేసులో ఇప్పటికే దుర్గా ప్రసాద్, అమిత్, ఎన్. నిఖత్ పర్వీన్‌లను అరెస్ట్ చేసిన ఎల్బీ నగర్ డివిజన్ ఏసీపీ బి. రవీంద్ర రెడ్డి నేతృత్వంలోని బృందం, తాజాగా సంస్థకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులను అదుపులోకి తీసుకుంది.
అరెస్టయిన నిందితులలో ముంబైకి చెందిన, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా నల్లగండ్లలో నివాసముంటున్న సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) ప్రతీక్ అనిల్ గగ్లానీ (44) [A-8] ఉన్నారు. అలాగే, అస్సాంకు చెందిన, ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో ఉంటున్న బేగంపేటలోని ఒయాసిస్ ఫెర్టిలిటీ కార్పొరేట్ ఆఫీసు మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ రాజర్షి దేబ్ (53) [A-9] కూడా అరెస్టయ్యారు. వీరిపై బీఎన్ఎస్ (BNS) లోని పలు కీలక సెక్షన్లతో పాటు ‘అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్, 2021’లోని సెక్షన్లు 33(2), 34 కింద కేసులు నమోదు చేశారు.
Also Read
నవంబర్ 27న సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో మధ్యవర్తుల సమక్షంలో జరిగిన విచారణలో నిందితులు ఈ అక్రమ దందా గుట్టును వెల్లడించారు. హైదరాబాద్‌లో ఒయాసిస్ సంస్థకు 10 సెంటర్లు ఉండగా, అందులో బంజారాహిల్స్, మియాపూర్, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్లలో నాలుగు లెవల్-2 ఐవీఎఫ్ (IVF) క్లినిక్‌లు ఉన్నాయి. సంస్థ ఫౌండర్, డైరెక్టర్ డాక్టర్ గెదెల దుర్గారావు ఆదేశాల మేరకు, మియాపూర్‌లోని సద్గురు ART బ్యాంక్ ఇన్చార్జ్ సునీల్ రాయ్ ఏజెంట్ల ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మహిళలను హైదరాబాద్‌కు రప్పించేవాడు. ఇలా రప్పించిన మహిళలకు అండాల ఉత్పత్తి పెరిగేందుకు HUMO-G, FOLLI SURGE, METERNA, TREGAR వంటి ప్రమాదకర ఇంజెక్షన్లు ఇచ్చి, అనంతరం లెవల్-2 క్లినిక్‌లకు తరలించి అక్రమంగా అండాలను సేకరించేవారు.
2025 నుంచి సీఓఓగా పనిచేస్తున్న ప్రతీక్ గగ్లానీ (A-8), ఈ అక్రమ కార్యకలాపాలకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలు, వసతుల ఏర్పాటుతో పాటు సంస్థ సీఎఫ్ఓ (CFO) ఆశిష్ అగర్వాల్ ద్వారా నిధుల సమన్వయం చేసేవాడు. దేశవ్యాప్తంగా ఉన్న 43 క్లినిక్‌లలో నెలకు సుమారు 600 సెల్ఫ్-సైకిల్స్, 100 డోనర్ సైకిల్స్ ద్వారా దాదాపు రూ. 27 నుంచి రూ. 28 కోట్ల ఆదాయం వస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇక ఏప్రిల్ 1, 2026 నుంచి నవంబర్ 26, 2026 మధ్య సంస్థకు చెందిన హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ ఖాతాలో ఏకంగా రూ. 487.82 కోట్ల భారీ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
మరోవైపు, ఏప్రిల్ 2026 నుంచి మెడికల్ అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ రాజర్షి దేబ్ (A-9), ఆపరేషన్ థియేటర్ల సిద్ధతతో పాటు యాజమాన్యం విధించే అక్రమ నిబంధనలకు తలొగ్గే వైద్యులను మాత్రమే నియమించేవాడు. తాము చేస్తున్నది చట్టవిరుద్ధమని తెలిసినా, యాజమాన్యం ఇచ్చే భారీ జీతభత్యాల (నెలకు రూ. 4.20 లక్షలు, రూ. 3.60 లక్షలు) ఆశతో వీరిద్దరూ ఈ రాకెట్‌కు పూర్తిస్థాయిలో సహకరించినట్లు విచారణలో అంగీకరించారు. నిందితుల నుంచి మూడు ఖరీదైన ఐఫోన్లను (రెండు ఐఫోన్ 13 ప్రో/పాత మోడల్ ఫోన్లు, ఒక ఐఫోన్ 14 ప్రో) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగతా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Oasis Fertility Scam: ఒయాసిస్ ఫెర్టిలిటీ కేసులో భారీ మలుపు.. సీఓఓ సహా ఇద్దరు ఉన్నతాధికారుల అరెస్ట్..
-
Koti Deepotsavam 2026 Day 15: నేడు కోటి దీపోత్సవంలో విశేష పూజలు.. శ్రీహరికి మహాభిషేకం, శ్రీనివాస కల్యాణం!
-
Bisleri in Trouble Again: మళ్లీ చిక్కుల్లో బిస్లెరీ.. నీటి నమూనాల్లో కోలిఫామ్ బ్యాక్టీరియా.. FSSAI కీలక చర్య
-
Moksagna: మోక్షజ్ఞ మూవీలో నటించడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్?
-
Tollywood: మాస్ హీరోలుగా మారడం కాదు.. ఆ హీరోలను చూసి నేర్చుకోండి..!
ట్రెండింగ్
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
-
Rishabh Pant: WTC చరిత్రలో ‘రిషబ్ పంత్’ సరికొత్త చరిత్ర..!