Site icon NTV Telugu

O Panneerselvam: డీఎంకేలో చేరిన జయలలిత ఆప్తుడు, మాజీ సీఎం పన్నీర్ సెల్వం..

O Panneerselvam

O Panneerselvam

O Panneerselvam: అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్‌ సెల్వం డీఎంకే పార్టీలో చేరారు. సీఎం ఎంకే స్టాలిన్‌ స్వయంగా ఆయనకు శాలువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు. “నేను సంతోషంగా డీఎంకేలో చేరాను.. మళ్ళీ తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలో అధికారంలో వస్తారు.. పళణి స్వామి ఎఐడీఎంకేను నాశనం చేస్తాడు.. పళణి స్వామి ఒక నియంత.. ఏఐడీఎంకేలో ఏ నాయకుడు ఎదగడానికి లేకుండా కుట్రలు చేస్తున్నాడు.. పళని స్వామి ఎన్నికలలో ఇంక ఎప్పుడూ గెలవలేడు.. ఏఐడీఎంకేకు ఇక భవిష్యత్తు లేదు.. పళణి స్వామి ఇచ్చిన హామలను ప్రజలు పట్టించుకోవడం లేదు.” అని వ్యాఖ్యానించారు.

READ MORE: OpenAI: సిలికాన్ వ్యాలీలో AI టాలెంట్ వార్.. మెటాలో రూ.1,800 కోట్ల ప్యాకేజీ ఉన్న ఏఐ రీసెర్చర్ ని నియమించుకున్న ఓపెన్‌ఏఐ

ఇక.. 2001లో పెరియకులం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు పన్నీర్‌సెల్వం.. మొదటి సారి ఎమ్మెల్యేగా అయిన తర్వాత జయలలితా మంత్రివర్గంలో ఆదాయ శాఖ మంత్రిగా పని చేశారు. టాన్సీ కేసు నేపథ్యంలో 2001 సెప్టెంబర్ 21 – 2002 మార్చి 1 వరకు తొలి సారి సీఎం అయ్యారు. 2014లో అక్రమ ఆస్తుల కేసులో జయలలితా జైలుకెళ్లడంతో రెండోసారి సీఎం అయ్యారు. ఆమె మరణం తర్వాత మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2017 ఫిబ్రవరి 7న స్మారక స్థలంలో ధర్మయుద్ధం ప్రకటించారు.. రెండేళ్ళ క్రితం ఏఐడీఎంకే నుంచి బహిష్కరించారు.. లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమితో రామనాథపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తరువాత పార్టీలో చేర్చే అవకాశం లేదని ఎడప్పాడి పళనిస్వామి స్పష్టం చేశారు. తాజాగా డీఎంకేలో చేరారు.

READ MORE: Pakistan-Afghanistan Clashes: పాకిస్థాన్‌కు బిగ్‌ షాక్.. F-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఆఫ్ఘాన్..! కానీ..

Exit mobile version