O Panneerselvam: డీఎంకేలో చేరిన జయలలిత ఆప్తుడు, మాజీ సీఎం పన్నీర్ సెల్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
O Panneerselvam: అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం డీఎంకే పార్టీలో చేరారు. సీఎం ఎంకే స్టాలిన్ స్వయంగా ఆయనకు శాలువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు. “నేను సంతోషంగా డీఎంకేలో చేరాను.. మళ్ళీ తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలో అధికారంలో వస్తారు.. పళణి స్వామి ఎఐడీఎంకేను నాశనం చేస్తాడు.. పళణి స్వామి ఒక నియంత.. ఏఐడీఎంకేలో ఏ నాయకుడు ఎదగడానికి లేకుండా కుట్రలు చేస్తున్నాడు.. పళని స్వామి ఎన్నికలలో ఇంక ఎప్పుడూ గెలవలేడు.. ఏఐడీఎంకేకు ఇక భవిష్యత్తు లేదు.. పళణి స్వామి ఇచ్చిన హామలను ప్రజలు పట్టించుకోవడం లేదు.” అని వ్యాఖ్యానించారు.
Also Read
ఇక.. 2001లో పెరియకులం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు పన్నీర్‌సెల్వం.. మొదటి సారి ఎమ్మెల్యేగా అయిన తర్వాత జయలలితా మంత్రివర్గంలో ఆదాయ శాఖ మంత్రిగా పని చేశారు. టాన్సీ కేసు నేపథ్యంలో 2001 సెప్టెంబర్ 21 – 2002 మార్చి 1 వరకు తొలి సారి సీఎం అయ్యారు. 2014లో అక్రమ ఆస్తుల కేసులో జయలలితా జైలుకెళ్లడంతో రెండోసారి సీఎం అయ్యారు. ఆమె మరణం తర్వాత మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2017 ఫిబ్రవరి 7న స్మారక స్థలంలో ధర్మయుద్ధం ప్రకటించారు.. రెండేళ్ళ క్రితం ఏఐడీఎంకే నుంచి బహిష్కరించారు.. లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమితో రామనాథపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తరువాత పార్టీలో చేర్చే అవకాశం లేదని ఎడప్పాడి పళనిస్వామి స్పష్టం చేశారు. తాజాగా డీఎంకేలో చేరారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!