టాలీవుడ్ ప్రేక్షకులు హారర్ సినిమాలంటే ఎంతో ఆసక్తి చూపిస్తారు.ఇక హారర్ కు కామెడీ తోడైతే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది.టాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా ఈ జోనర్ లో సినిమాలు తెరకెక్కుతున్నాయి.హారర్ కు కామెడీ వర్క్ అవుట్ అయితే మాత్రం ఆ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడతారు.హారర్ కామెడీ ఫార్ములాతో టాలీవుడ్ లో మరో సినిమా సినిమా రాబోతుంది.ఆ సినిమానే ‘ఓ మంచి ఘోస్ట్’..ఈ సినిమాలో వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్ మరియు నవీన్ నేని ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాను మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై డా.అబినికా ఇనాబతుని నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇప్పటికే ‘ఓ మంచి ఘోస్ట్’ సినిమా నుంచి ఓ సాంగ్ మరియు కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేయగా తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుండి టీజర్ ను రిలీజ్ చేసారు.ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను భయపెడుతూనే నవ్వించింది. ఈ సినిమాలో నందితా శ్వేతా ఘోస్ట్ గా నటించింది. అయితే ఈ సినిమా టీజర్ పూర్వ జన్మ జ్ఞానంతో మళ్లీ జన్మించే అవకాశం కేవలం దెయ్యాలకు మాత్రమే ఉంటుంది అనే ఆసక్తికర డైలాగ్‌తో మొదలవుతుంది.ఈ సినిమా ఆద్యంతం ఫన్నీగా సాగుతూనే ప్రేక్షకులను భయపెడుతుంది.మేకర్స్ త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.