NVSS Prabhakar: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నేడు (మే 14)న మీడియా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తున్న, ఇకముందు కూడా చేస్తానని హరీష్ రావు చెప్పుకున్నారు.. కేటీఆర్ నాయకత్వంలో కూడా పని చేస్తానని వివరించుకున్నారు.. ఎందుకు హరీష్ రావు అలా మాట్లాడారన్నది ఇప్పుడు ప్రధాన అంశమని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని, పదేళ్ల బీఆర్ఎస్ పాలన పూర్తి అయి.. కాంగ్రెస్ పాలన ప్రారంభమైందని అన్నారు. జూన్ 2 లేదా డిసెంబర్ 9 తరువాత కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం తథ్యమని ఆయన సంచలన కామెంట్స్ చేసారు.
Read Also: RTI Commissioners: కొత్త సమాచారం కమిషనర్లు నియామకం.. నలుగురు ప్రమాణ స్వీకారం.!
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి మార్పు ఖాయం.. రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు లబ్ది దారుల ఎంపికలో అనేక అవకతవకలు జరిగాయి.. ఒక్క గ్రామంలో పేద, దళిత, దివ్యాంగ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు రాలేదని, ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపైన విచారణ జరిపించాలని ఆయన అన్నారు. అలాగే, ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయ్యిందని.. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ను మరోసారి ఏకాకిని చేసిన చరిత్ర నరేంద్ర మోడీది అని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.
Read Also: Nubia Z70S Ultra: 50MP+50MP కెమెరాలు, 6600mAh బ్యాటరీతో నుబియా Z70S అల్ట్రా గ్లోబల్ లాంచ్..!
కమ్యూనిస్టులను బంగాళాఖాతంలో కలిపింది బీజేపీ, అంతర్జాతీయ విధానాన్ని కమ్యూనిస్టులు వీడాలని ఆయన అన్నారు. కమ్యూనిస్టులు ఎదగాలి, పాలించాలి అనికాకుండా బీజేపీనీ ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన తెలిపారు. కాలం చెల్లిన కమ్యూనిజానికి దేశంలో స్థానం లేదని ఆయన అన్నారు.
