ఈమధ్యకాలంలో అమ్మాయిలు తెలివిమీరిపోయారు.. మనసొకడితో.. తనువు మరొకడితో.. మనసిక్కడ.. మనిషక్కడ అన్నట్టుగా వుంది. ఏలూరు జిల్లాలో జరిగిన ఒక కేసు సంచలనంగా మారింది. అదనపు కట్నం తెమ్మని అల్లుడు కొడుతున్నాడని ఆ స్టేషన్లో కేసు పెట్టారు. పోలీసులపై దాడికి యత్నించారు. మా కుమార్తెను చంపేసి ఉంటాడని అనుమానించారు. ఇదంతా ఏంటి ? ఏమి జరిగిందో తెలిస్తే మీరు షాకవ్వకమానరు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు గ్రామానికి చెందిన రాజ్ కుమార్ కు ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలానికి చెందిన యేసుపాదం రమాదేవిల రెండవ కుమార్తె ఐశ్వర్య ను ఇచ్చి రాజ్ కుమార్ కు మూడు నెలల క్రితం వివాహం జరిపారు.
ఐశ్వర్య పుట్టింటికి వెళ్తాను అంటే మొగుడు రాజ్ కుమార్ నూజివీడు బస్టాండ్ లో దింపాడు. ఐశ్వర్య పుట్టింటికి రాకపోవటంతో వేచి చూసిన తండ్రి ఏసు పాదం అనుమానంతో రాజకుమార్ పై ఆగిరిపల్లి , నూజివీడు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశాడు. రాజ్ కుమార్ నూజివీడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని తెలుసుకుని నా కుమార్తెను రాజకుమార్ చంపి ఉంటాడని మాకు అప్పగించండి అంటూ గొడవ చేశారు. పోలీసులకు ఐశ్వర్య బంధువులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు పోలీస్ స్టేషన్ కి తాళం కూడా వేశారు. గొడవ తర్వాత దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐశ్వర్య జాడ వెతికే ప్రయత్నం చేశారు.
Read Also: Uttarakhand Accident : ఉత్తరాఖండ్ లో ఘోరం.. కాల్వలో పడ్డ కారు.. నలుగురి మృతి
ఫోన్ కాల్ ఆధారంగా ఐశ్వర్య ప్రియుడితో కలిసి భర్తను వదిలేసి వెళ్లిందని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. నందిగామకు చెందిన పులగం రమేష్ ఐశ్వర్యలు ఓ ప్రైవేట్ కళాశాలలో పనిచేసేవారు. అప్పటికే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉంది. రమేష్ కి ఐశ్వర్య కి గ్యాప్ రావడంతో రాజ్ కుమార్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారి వివాహ జీవితంలో చిన్న చిన్న గొడవలు అవుతూ ఉండటంతో మూడో తారీకు నాడు నూజివీడు బస్టాండ్ లో రాజ్ కుమార్ వదలి వెళ్లిన తర్వాత నూజివీడు బస్టాండ్ నుంచి మాజీ ప్రియుడు నందిగామ ప్రాంతంలోని ఉండటంతో ఫోన్ చేసి ఐశ్వర్య అక్కడికి చేరుకుంది. పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలినట్టు వివరాలన్నీ సేకరించి ఐశ్వర్య , పోలవరం రమేష్ ను భర్త రాజ్ కుమార్ ను నూజివీడు పోలీస్ కస్టడీలో ఉంచి దర్యాప్తు చేస్తున్నారు.ఈ వ్యవహారం రెండుజిల్లాల్లో కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ పై దాడి కేసులో కేసులు నమోదు చేశారు.